22.7 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ పవన్ ఓటమిపై స్పందించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్…

పవన్ ఓటమిపై స్పందించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్…

Ramcharan Tej News, Amitab Bacchan Latest News, Tollywood News, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: గురువారం విడుదలైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనకి చావుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఉన్న వైసీపీ వేవ్‌లో జనసేన పార్టీ కుదేలైపోయింది. వైసీపీ మొత్తం 175 స్థానాల్లో 151 స్థానాలని కైవసం చేసుకుంటే టీడీపీ 23 స్థానాలకి పరిమితమైంది.

ఇక జనసేన చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు ఒక సీటుని గెల్చుకుంది. అది కూడా రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ కేవలం 800 ఓట్లతో బయటపడ్డారు. ఇక ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కనీసం పోటీ చేసిన రెండు స్థానాల్లో ఎక్కడో ఒకచోట అయినా గెలుస్తారని అందరూ అనుకున్నారు.

కానీ జగన్ సుడిగాలి ముందు పవన్ కూడా తేలిపోయారు. ఇటు భీమవరం, అటు గాజువాక.. రెండు చోట్లా ఘోరంగా ఓడిపోయారు. పవన్ సోదరుడు నాగబాబు సైతం నరసాపురం పార్లమెంట్ స్థానంలో ఓటమి పాలయ్యారు. ఇక ఆ పార్టీ మిగతా అభ్యర్ధులు అయితే అని చోట్లా మూడో స్థానానికి పరిమితమయ్యారు.

ఇలా ఈ ఎన్నికల్లో జనసేన ఘోరంగా ఓడిపోవడంపై రామ్ చరణ్ స్పందించారు. “గొప్ప నాయకులు కేవలం నాయకులుగానే మిగిలిపోరు, మార్పు అంటే ఏంటో చూపిస్తారు. ఇది ఓ పాత్రకు సంబంధించిన విషయం కాదు, ఇదంతా ఓ లక్ష్యానికి సంబంధించిన విషయం..” అంటూ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఆయనొక పోస్టు పెట్టారు.

అలాగే ఈ ఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్ గారికీ, జనసేన పార్టీకి భేషరతుగా సేవలు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ తన పోస్టులో పేర్కొన్నారు రామ్ చరణ్.

చదవండి:

- Advertisement -