23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ నైజాం లో రామ్ చరణ్ ని దాటేస్తాడా..

నైజాం లో రామ్ చరణ్ ని దాటేస్తాడా..

Ram Charan Latest News, Maharshi Movie News, Tollywood Movie News, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: మహేష్ బాబు మహర్షి సినిమా మే 9 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. యూఎస్ లో భారీ వసూళ్లు వస్తాయని అనుకుంటే ఆశించినంతగా వసూళ్లు రాలేదు.

అలాగే, సీడెడ్ లో కూడా సినిమా వసూళ్ళకు కాస్త ఇబ్బందులు ఏర్పడ్డాయి. మహేష్ సినిమాలు సీడెడ్ లో వసూళ్లు బాగుంటాయి. నైజాం లో మాత్రం సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతున్నది. ఇప్పటికే ఈ సినిమా నైజాంలో రూ.22.05 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది.

మరో 27 లక్షలు షేర్ వసూలు చేస్తే శ్రీమంతుడు లాంగ్ రన్ షేర్ ను బీట్ చేస్తుంది. ఈరోజుతో ఈ టార్గెట్ పూర్తవుతుంది. ఇదిలా ఉంటె, మహేష్ బాబు నెక్స్ట్ టార్గెట్ రామ్ చరణ్ అని చెప్పొచ్చు.

రామ్ చరణ్ రంగస్థలం సినిమా నైజాంలో ఫుల్ రన్ లో 27.76 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ రికార్డును మహర్షి తప్పకుండా బీట్ చేస్తుందని అంటున్నారు. మరి ఈ టార్గెట్ ను బీట్ చేస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇదిలా ఉంటె తెలంగాణలో విజయం సాధించిన తరువాత యూనిట అనేక ప్రెస్ మీట్ లను నిర్వహించింది. సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు మహర్షి విజయోత్సవ సభను విజయవాడలో సిద్దార్ధ కళాశాల ఆవరణలో భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో యూనిట్ అంతా పాల్గొంటారని సమాచారం. అటు గుంటూరు, కృష్ణ తదితర ప్రాంతాల్లో నాన్ బాహుబలి రికార్డులను మహర్షి సొంతం చేసుకుంది.

చదవండి: హిట్ చిత్రాల జాబితాలో నాని ‘జెర్సీ’
- Advertisement -