అభిమానులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన తారక్…

11:12 am, Fri, 14 June 19

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్…..తన అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఒకటి ఇచ్చారు. ఈరోజు తన చిన్న కుమారుడు భార్గవ్ రామ్ పుట్టినరోజు సందర్బంగా… తారక్ ఇన్ స్టా గ్రామ్ లో స్పందించాడు.

భార్గవ్‌తో దిగిన ఫొటోను ఎన్టీఆర్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి… భార్గవ్‌కు అప్పుడే ఏడాది వయసు వచ్చేసిందని వ్యాఖ్యానించాడు. అలాగే తన పెద్ద కుమారుడు అభయ్ రామ్‌తో భార్గవ్ రామ్ కలిసి ఉన్న మరో ఫోటోని కూడా షేర్ చేశాడు.

Image may contain: 2 people, people smiling, people sitting and child

ఇక ఈ ఫోటోలని చూసిన అభిమానులు…వాటిని షేర్ చేస్తూ భార్గవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. మొత్తానికి తారక్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడని అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.

కాగా, ప్రస్తుతం తారక్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం 2020 జూలై 30న విడుదల కానుంది.

చదవండి: అదరగొడుతున్న సాహో టీజర్‌ !