29.5 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ నాగార్జున అభిమానులలో ఫుల్ జోష్..మన్మధుడు 2 షూటింగ్ స్టార్ట్!

నాగార్జున అభిమానులలో ఫుల్ జోష్..మన్మధుడు 2 షూటింగ్ స్టార్ట్!

nagarjuna new film manmadhudu 2 shouting start
- Advertisement -

హైదరాబాద్: గత కొంతకాలంగా నాగార్జున ముఖంలో గ్లో తగ్గడమే కాకిండా కొంత నీరసంగా కనిపించిన పరిస్థితులలో నాగార్జునకు ఏమైంది అంటూ జరిగిన ప్రచారానికి నాగ్ అభిమానులు తెగ కలవర పడ్డారు. అయితే తన పై వస్తున్న వార్తలకు సమాధానం ఇస్తూ నాగార్జున మళ్ళీ వెండి తెర మన్మధుడుగా తయారై కెమెరా ముందుకు రావడంతో ఫుల్ జోష్ లో అతడి అభిమానులు ఉన్నారు.

గత సంవత్సరం నాగార్జున నటించిన సినిమాలు అన్నీ ఫెయిల్ అవ్వడంతో అతడి కెరియర్ పై అనేక సందేహాలు మొదలయ్యాయి. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ తనకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన ‘మన్మధుడు’ అదృష్టాన్ని నమ్ముకుని ‘మన్మధుడు 2’ మూవీని నిన్న లాంచ్ చేసారు.

వాస్తానికి ఈమూవీ కథకు పాత ‘మన్మధుడు’ కథకు సంబంధం లేకపోయినా క్రేజ్ కోసం ఈ టైటిల్ ను ఫిక్స్ చేసారు. యాక్టర్ టర్న్డ్ డైరెక్టర్ గా మారిన రాహుల్ రవీంద్రన్ కు ఈ ఛాన్స్ రావడానికి సమంత రికమండేషన్ బాగా పనిచేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు హీరోయిన్ గా ఎంతోమంది పేర్లు పరిశీలించి చివరకు రకుల్ ప్రీత్ ను ఫిక్స్ చేసారు.

అయితే వీరిద్దరి కాంబినేషన్ ఎంత వరకు స్క్రీన్ పై బాగుంటుంది అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.ప్రస్తుతం సినిమాలు లేక తెగ టెన్షన్ పడుతున్న రకుల్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఒక ఊహించని ట్విస్ట్. ‘RX100’ ఫేమ్ చైతన్య భరద్వాజ్ ఈసినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు.

వాస్తవానికి ఈసినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్నా ఈమధ్య ఈ బ్యానర్ పై వచ్చిన సినిమాలు అన్నీ ఫెయిల్ అయిన నేపధ్యంలో అక్కినేని ఫ్యామిలీకి ఎంతో పేరు తెచ్చిపెట్టిన ‘మనం’ మూవీ టైటిల్ ను ‘మనం ఎంటర్ ప్రైజెస్’ గా మార్చి నాగార్జున చేస్తున్న ప్రయోగం ఎంతవరకు అతడికి లక్ ను తెచ్చిపెడుతుందో చూడాలి..

- Advertisement -