కొరటాల సినిమాలో మెగాస్టార్ లుక్ ఫిక్స్!

Megastar-Is-Ready-To-Play-Dual-Role at koratala siva
- Advertisement -

హైదరాబాద్: చిరంజీవి 151వ సినిమాగా ‘సైరా’ నిర్మితమవుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా షూటింగు ముగింపు దశకి చేరుకుంటూ ఉండటంతో, చిరూతో ఆ తరువాత సినిమా చేయనున్న కొరటాల, తన ప్రాజెక్టుకు సంబంధించిన పనులను వేగవంతం చేశాడు.

అందులో భాగంగా రీసెంట్ గా చిరంజీవిపై ఆయన ఫొటో షూట్ ను నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో రైతుగా, ఇంతవరకూ చిరంజీవిని ఎవరూ చూపించనంత విభిన్నంగా చూపించాలనే ఉద్దేశంతో కొరటాల ఒక లుక్ ను డిజైన్ చేయించాడట.

ఆ లుక్ ను ఖరారు చేసుకుని, షూటింగు సమయానికి కొంత బరువు తగ్గవలసి ఉంటుందని చిరంజీవికి సూచించినట్టుగా సమాచారం. ఈ సినిమాలో కథానాయికలుగా శ్రుతి హాసన్, తమన్నాలను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

- Advertisement -