22.7 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ తీవ్ర విషాదంలో మెగాస్టార్! ‘సైరా’లో మరో అపశృతి!

తీవ్ర విషాదంలో మెగాస్టార్! ‘సైరా’లో మరో అపశృతి!

- Advertisement -

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకుంటున్న సైరా సినిమాకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఇప్పటికే కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రెండు సెట్లు వృథా అయిన సంగతి తెలిసిందే. దీంతోనే సినిమా చిత్రీకరణ ఆలస్యం అయిందని భావిస్తున్న వేళ, తాజాగా, రష్యాకు చెందిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ మృతిచెందాడు.

టూరిస్ట్ వీసాపై మార్చిలో హైదరాబాద్ కు వచ్చి, సైరాలో ఓ పాత్రను పోషిస్తున్న అలెగ్జాండర్ (38) అనే వ్యక్తి గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్‌ గేట్‌ నెంబర్‌–1 వద్ద అపస్మారక స్థితిలో కనిపించాడు. ఎండ వేడిమిని తాళలేక ఆయన పడిపోగా, పోలీసులు తొలుత కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి, ఆపై గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.

అతని కెమెరాలోని చిత్రాల ఆధారంగా, 4, 5 తేదీల్లో సైరా సినిమాలో నటించాడని, గచ్చిబౌలి సమీపంలోని ఓ హోటల్‌ లో నివాసం ఉంటున్నాడని పోలీసులు గుర్తించారు. వడదెబ్బ కారణంగానే అలెగ్జాండర్‌ మృతి చెందాడని, గోవాలో ఉన్న అతని స్నేహితునికి సమాచారం ఇచ్చామని, అతను వచ్చిన తరువాత పోస్టుమార్టం నిర్వహిస్తామని పోలీసులు వెల్లడించారు.

 
 
- Advertisement -