దోసె కోసం కష్టపడిన మెగాస్టార్ చిరంజీవి!

12:46 pm, Mon, 5 August 19

హైదరాబాద్: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంటిదగ్గర చాలా సాధారణంగా ఉంటారు. సమయం దొరికితే వంటింట్లో దూరి కొత్తకొత్త ప్రయోగాలు చేస్తుంటారు. అందులో భాగంగానే ఓ సరికొత్త దోసెను తయారు చేశారు. దోసె చేయడం కూడా గొప్పేనా అనుకోకండి. ఎందుకంటే ఈ దోశలో ఉండే టేస్ట్ మామూలుగా ఉండదు మరి. ఆయన ఇంటికి వచ్చే ఆతిధులకు ఈ దోసెను తప్పకుండా వడ్డిస్తారట.

దీనికి ఓ ప్రత్యేకత ఉన్నది. చాలా కాలం క్రితం మెగాస్టార్ చిక్ మంగళూరు ప్రాంతంలో ఓ చిన్న హోటల్ లో దోసె తిన్నారట. దాని టేస్ట్ బాగుండడంతో ఎలా చేశారని అడిగితే చెప్పలేదట. దీంతో ఎలాగైనా ఆ దోసెను తయారు చేయాలని చిరు భావించారట. అప్పటి నుంచి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఎట్టకేలకు దానిని తయారుచేశారట.