25.6 C
Hyderabad
Saturday, November 28, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ మహర్షి ట్విట్టర్ రివ్యూ ! అంచనాలని అందుకుందా!

మహర్షి ట్విట్టర్ రివ్యూ ! అంచనాలని అందుకుందా!

Maharshi-Live-Reveiw
- Advertisement -

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం మహర్షి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా నేడే అనగా మే 9 న విడుదలైంది. ఇండియా కంటే ముందే యూఎస్ఏ, మరికొన్ని ఓవర్సీస్ లొకేషన్లలో ప్రీమియర్ షోలు కూడా వేశారు. ఇక ఇప్పటికే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా షోలు కంప్లీట్ అయినట్టుగా తెలుస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఏరియాల నుంచి మహర్షి చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. మహేష్ బాబు మూడు విభిన్నమైన పాత్రల్లో అదరగొట్టాడని, వంశీ పైడిపల్లి సినిమా మొదటి భాగం వినోదాత్మకంగా, రెండో భాగం ఎమోషనల్‌గా రూపొందించినట్లు చెబుతున్నారు. అన్నికంటే ముఖ్యంగా మహర్షి కథ అద్భుతంగా ఉందనే టాక్ వినిపిస్తోంది.

ఇకపోతే సూపర్ స్టార్ మహేష్‌ బాబు ఈ మధ్య కాలంలో సామాజిక నేపథ్యం ఉన్న కథల్ని ఎంచుకుంటున్నారు. కమర్షియల్ అంశాలకు ఎక్కడా డోకా లేకుండా సమాజంలో ఉన్న సమస్యలను ఎత్తిచూపుతూ మంచి హిట్లు అందుకుంటున్నారు. ఏలేద్దామనుకుంటున్న సార్ అని ధీమాగా చెప్పిన మహేష్ బాబు అన్నట్టుగానే ప్రపంచాన్ని ఏలేస్తున్నాడు.

మహేష్ కెరియర్‌లో 25వ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నేడు థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌ను తెచ్చుకుంటోంది. శ్రీమంతుడు, భరత్ అనే నేను తరహాలో మహర్షి సినిమాలో కూడా మహేష్ ఒక మంచి సామాజిక అంశాన్ని లేవనెత్తాడు. రైతులు పడుతున్న కష్టం, వారి పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు మహేష్. సినిమా కథ పూర్తిగా ఎమోషనల్‌తో మిక్స్ చేస్తూ నేటి తరం జనాలకు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించాడు అని చిత్ర యూనిట్ పై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మహేష్ ల్యాండ్‌మార్క్‌ మూవీ కావడంతో ఎలాంటి ప్రయోగాలు లేకుండా ఒక సాధారణ కథతో మనముందుకు వచ్చిన మహేష్ మరో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్తున్నారు. ఎమోషనల్‌గా సాగిన క్లైమాక్స్ సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లింది అని, పదరా పదరా సాంగ్ అదిరిపోయింది అని చెప్తున్నారు.

- Advertisement -