లక్ష్మీస్ ఎన్టీఆర్ …ప్లస్ లు , మైనస్ లు

lakshmis ntr
- Advertisement -

హైదరాబాద్: లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎన్నో వివాదాలు, అంతకుమించి అంచనాల మధ్య ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా , ఆంధ్రప్రదేశ్ మినహా.. ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ నేపధ్యంలో ఇప్పటికే కొన్ని దేశాల్లో సినిమా షోలు పూర్తాయ్యాయి. అక్కడ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా మొత్తం లక్ష్మి పార్వతి కోణంలోనే సాగింది.

అలాగే చంద్రబాబు వెన్ను పోటు ఎపిసోడ్, దాదాపు అందరికీ తెలిసిన విషయాన్నే డ్రమటైజ్ చేస్తూ వర్మ ఈ సినిమాని తెరకెక్కించారు. సినిమా ఫస్ట్ హాఫ్ లో లక్ష్మీపార్వతి ని హైలెట్ చేస్తూ, ఆవిడ చాలా అమాయకురాలని, ఓ అభిమానిగా ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశించిందని , అంతకు మించి ఆమెకు వేరే ఆలోచన లేదన్నట్లుగా తెరకెక్కించారు.

అలాగే చంద్రబాబు ఎంట్రీ చాలా సాదా సీదాగా ఉందని, ఆ సన్నివేశాలు ఆకట్టుకోలేదని కొందరు చెప్తున్నారు. అయితే చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతను వర్మ,ఈ సినిమాలో ఏ మొహమాటం లేకుండా పూర్తిగా బయటపెట్టేశారని చెబుతున్నారు. మొత్తంగా రాజకీయాల మీద ఇంట్రస్ట్ ఉన్నవాళ్లకు తప్ప వేరే వాళ్లకు అంతగా నచ్చకపోవచ్చు అని చెప్పచ్చు. అదే సమయంలో ఇటువంటి సినిమాను తీయటం , ఇంత ధైర్యంగా ఓ ముఖ్యమంత్రిని నెగిటివ్ గా చూపించటం కేవలం వర్మ వల్లే అవుతుందని, వేరే ఏ ఫిల్మ్ మేకర్ కు ఆ ధైర్య లేదని ఆయన్ను అభినందించకుండా ఉండలేమని ప్రశంసిస్తున్నారు.

ఒకరిద్దరు అయితే ఎన్టీఆర్-లక్ష్మీపార్వతి మధ్య నడిచిన ఓల్డేజ్ లవ్ స్టోరీని ఆకట్టుకునేలా చూపించారని మెచ్చుకుంటున్నారు. అన్నిటికన్నా హైలెట్ ఈ సినిమాకు కల్యాణ్ మాలిక్ అందించిన సంగీతం అని కొనియాడుతున్నారు. లక్ష్మీపార్వతి పాత్రలో యజ్ఞాశెట్టి సూపర్ గా సెట్ అయ్యిందని చెబుతున్నారు.

ఎన్టీఆర్ పాత్రలో పి.విజయ్ కుమార్ పరకాయ ప్రవేశం చేసాడని, ఆయన అద్దినట్టు సరిపోయాడని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా, సినిమా ఓ వర్గాన్ని బాగా ఆకట్టుకుంటోంది. వర్మ గత చిత్రాల్లా చూడలేనంత నీరసంగా , బోర్ గా అయితే మాత్రం లేదు. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే వర్మ మరియు అగస్త్యలు చేసిన సాహసోపేత ప్రయత్నం పర్వాలేదనిపించే స్థాయిలోనే ఉందని చెప్పాలి.

ఎన్టీఆర్ నిజ జీవితంలో జరిగిన ఘటనలు కొన్ని కొన్ని ఈ సినిమాకి హైలైట్ అవ్వగా అక్కడక్కడా సాగదీతగా సాగే కథనం ఎక్కువగా లక్ష్మీ పార్వతినే హైలైట్ చేయడంవలన కథ పక్కతోవ పడుతున్నట్టు అనిపించడం సినిమాకి మైనస్ అని చెప్పొచ్చు.కానీ ఇప్పుడు ఎన్నికల సీజన్ కావడం అలాగే ఈ సినిమా కాంట్రవర్సీ నేపధ్యం కావడంతో ఓపెనింగ్స్ లో మంచి వసూళ్లు రాబట్టేందుకు అవకాశం ఉంది.

- Advertisement -