26.2 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ నువ్వేమైనా పెద్ద స్టార్ అనుకుంటున్నావా?: కృష్ణుడు సంచలన వ్యాఖ్యలు!

నువ్వేమైనా పెద్ద స్టార్ అనుకుంటున్నావా?: కృష్ణుడు సంచలన వ్యాఖ్యలు!

actor-krishnudu-joins-in-ys-1533531942
- Advertisement -

అమరావతి: ఏపీ రాజకీయాలు క్రమంగా సినీ ఇండస్ట్రీ వైపునకు తిరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు స్టార్‌లు తమకి నచ్చిన అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ వారి తరపున ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో శివాజీ.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడంపై మరో నటుడు కృష్ణుడు తాజాగా మాట్లాడుతూ శివాజీ‌పై నిప్పులు చెరిగారు.

‘నేను పెద్ద స్టార్’ అని శివాజీ భావిస్తుంటాడని ఇటీవల వైసీపీలో చేరిన నటుడు కృష్ణుడు తెలిపారు. ఆయన క్యారెక్టర్ ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసని వ్యాఖ్యానించారు.

ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణుడు మాట్లాడుతూ.. గతంలో శివాజీ బీజేపీలో ఉన్నప్పుడు తిరుపతి మీటింగ్ అయ్యాక అనంతపురానికి వచ్చాడని, అక్కడి ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్‌లో ఆయనకు బస ఏర్పాటు చేసిన సందర్భంగా తనకు బిర్యానీ, మద్యం ఇతరత్రా అరేంజ్ చేయాలని కోరాడని చెప్పారు.

దీంతో ఇలాంటి మేం చేయం అని అస్వర్థ అనే బీజేపీ కార్యకర్త శివాజీ ముఖం మీదే చెప్పాడని,అంతేకాకుండా ఈ విషయాన్ని సదరు బీజేపీ కార్యకర్త ఆ పార్టీ అధిష్ఠానానికి కూడా చేరవేశాడని కృష్ణుడు వివరించారు. ఛఛ.. ఇలాంటి పనులు మనం చేయకూడదంటూ బీజేపీ పెద్దలు శివాజీని మందలించారని, దీంతో బీజేపీ నేతల మీద అలిగి శివాజీ ఆ పార్టీకి రాజీనామా చేశాడని ఆయన వివరించారు.

అలాంటి శివాజీ క్యారెక్టర్ గురించి తాను మాట్లాడాల్సిన అవసరం లేదని కృష్ణుడు స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు నంది అంటే నంది.. పంది అంటే పంది అని శివాజీ అన్న విషయాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. తనకు తగినంత మంది వేగులు ఉన్నారనీ, అందువల్లే ఈ విషయాలన్నీ తెలిశాయని కృష్ణుడు పేర్కొన్నారు.

- Advertisement -