కాంచన 3 హిట్టా ..ఫట్టా .. ట్విటర్ రివ్యూ ..!

kANCHANA twitter review
- Advertisement -

హైదరాబాద్: సూపర్ హిట్ సిరీస్ కాంచన మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సిరీస్ మీద జనాల్లో మంచి ఆదరణ ఉంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదల చేశారు.

లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రూపొందడం, ఇప్పటి వరకు ఈ సీరిస్‌లో వచ్చిన సినిమాలన్నీ హిట్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగిన విధంగానే గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో షోలు ప్రారంభం కావడంతో ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.

ఈ సారి కూడా లారెన్స్ హిట్టు కొట్టినట్లేనా? ఆడియన్స్ ఏమంటున్నారు? ఓ లుక్కేద్దాం. కాంచన-3 ఫస్టాఫ్ వీరలెవల్లో ఉంది. సెకండాఫ్ పక్కా ఫ్యామిలీ ఎంటర్టెనర్ అంటూ సినిమా చూసిన ఆడియన్స్ ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఫస్టాఫ్ మాస్, సెకండాఫ్ డబుల్ మాస్. పైసా వసూల్ మూవీ. ఫ్యామిలీ, పిల్లలకు కూడా నచ్చుతుంది.

సూపర్ మాస్ మూవీ. కాంచన, ముని అభిమానులు తప్పకుండా చూడాల్సిన మూవీ. కాంచన-4 కూడా రాబోతోంది. సినిమా ఫస్టాఫ్ మాస్, సెకండాఫ్ మమ మాస్. రాఘవ లారెన్స్ నుంచి మరో బ్లాక్ బస్టర్. కాంచన-3 ఔట్ డేటెడ్ హారర్ కామెడీ. చాలా చోట్ల సినిమా ఇరిటేట్ చేసే విధంగా ఉంది. కాంచన-3 ఫర్వాలేదు. ఫ్యామిలీ, పిల్లలకు నచ్చుతుంది. ఫస్టాఫ్‌లో హారర్ సీన్స్ టాప్ రేంజిలో ఉన్నాయి. కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అయింది. కొన్ని మాస్ సీన్లు భరించగలిగితే నచ్చుతుంది.

- Advertisement -