
చెన్నై: ప్రముఖ తమిళ నటుడు, తుప్పరివలన్ స్టార్ విశాల్, ఆయన తండ్రికి కరోనా సోకింది. తొలుత తన తండ్రికి పాజిటివ్ రాగా ఆయనకు సహకరిస్తున్న తరుణంలో జ్వరం, జలుబు, దగ్గు తదితర పాజిటివ్ లక్షణాలు కనిపించాయని విశాల్ తెలిపాడు.
ఆ తర్వాత తనకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పరీక్షల్లో తేలిందన్నాడు. విశాల్ మేనేజర్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని విశాల్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు.
తామంతా ఆయుర్వేదం మందులు వాడుతున్నామని, ఓ వారంలో కోలుకుంటామని విశాల్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. హిందీ చిత్ర పరిశ్రమలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్యరాయ్ తదితరులు ఇప్పటికే ఈ మహమ్మారి బారినపడ్డారు.
ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నటి, ఎంపీ సుమలత కూడా కరోనా బారినపడిన విషయం తెలిసిందే.
Yes it’s True, my Dad was tested Positive, by helping him I had the same symptoms of High Temperature, Cold, Cough & was the same for my Manager.
All of us took Ayurvedic Medicine & were out of Danger in a week’s time. We are now Hale & Healthy.
Happy to Share this….GB
— Vishal (@VishalKOfficial) July 25, 2020








