

హైదరాబాద్: హీరో విశాల్ వివాహానికి సంబంధించి సోషల్ మీడియాలో పలు పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. ఆ మధ్య వీటిపై స్వయంగా విశాల్ స్పందించి, అవన్నీ నిజం కాదని, తన వివాహం గురించి తానే అధికారికంగా ప్రకటిస్తానని, అప్పటి వరకు ఇలాంటి వదంతులు నమ్మవద్దని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు.
ఇప్పుడు తాజాగా విశాల్ త్వరలో జరగనున్న తన వివాహం గురించి, తన జీవిత భాగస్వామి గురించి ట్వీట్ ద్వారా తెలిపాడు.
మరి ఇంకేంటి? విశాల్ అభిమానులైతే సంబరాలు జరుపుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగానే జరిగితే త్వరలోనే విశాల్ ఓ ఇంటివాడు కానున్నాడు. అతడు పెళ్లాడబోయే అమ్మాయి మరెవ్వరో కాదు.. హైదరాబాద్‌కు చెందిన ఓ వాణిజ్యవేత్త కుమార్తె అనీషా రెడ్డి. విశాల్ తండ్రి, నిర్మాత జీకే రెడ్డి ఇటీవల మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
దీంతో గత కొన్ని రోజులుగా విశాల్ పెళ్లిపై వస్తున్న వివిధ పుకార్లకు పుల్‌స్టాప్ పడినట్లయింది. విశాల్, అనీషాల నిశ్చితార్థం త్వరలోనే హైదరాబాద్‌లోనే జరగనుంది.
అనీషా రెడ్డి ఎవరంటే…
హీరో విశాల్ పెళ్లాడబోయే అమ్మాయి అనీషా రెడ్డికి సినీ రంగంతో పరిచయం ఉంది. విజయ్ దేవరకొండ నటించిన ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’ సినిమాల్లో ఈమె కూడా నటించింది. ‘పెళ్లి చూపులు’ సినిమాలో విజయ్‌కు ప్రేయసి పాత్రలో అనీషా కనిపించింది. విశాల్‌తో తన పెళ్లి గురించి అనీషా కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. అంతేకాదు, విశాల్‌తో కలిసి తీసుకున్న ఫొటోను పోస్ట్ చేసింది.
‘‘కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నా. త్వరలో నా కలలన్నీ నిజం కానున్నాయి. నాతో జీవితాన్ని పంచుకునే తోడు దొరికింది. అతని మనసు చాలా మంచిది. అందరి స్వరం వినిపిస్తూ ప్రతి ఒక్కరికీ మద్దతుగా ఉంటాడు. అతనికి నచ్చిన జీవిత భాగస్వామిగా ఉండగలనని ఆశిస్తున్నాను..’’ అని అనీషా రెడ్డి పేర్కొంది.
Yes.. happy. Too happy. Happiest. Her name s #AnishaAlla. And yes she said yes. And it’s confirmed. My next biggest transition in life.????❤️❤️❤️??? will be announcing the date soon. God bless. pic.twitter.com/NNF7W66T2h
— Vishal (@VishalKOfficial) January 16, 2019
And when love and Angels are in the air. ❤️#Anisha Alla @VishalKOfficial pic.twitter.com/JfZQj5oA4k
— vasuki bhaskar (@vasukibhaskar) January 15, 2019








