
హైదరాబాద్: నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు అతిపెద్ద ఫ్యాన్. పవన్‌ను ఆదర్శంగా తీసుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నితిన్ చిన్నప్పటి నుంచి పవన్నే దేవుడిగా కొలిచాడు. ఇదే విషయాన్ని నితిన్ కూడా అనేక సార్లు మీడియాతోను పంచుకున్నాడు.
స్టేజ్‌ల మీద పవన్‌పై భక్తిని చాటుకున్నాడు. ఇటు సినిమాల్లోను పవన్‌ను నితిన్ అనుకరిస్తూ వస్తున్నాడు. ఇష్క్ సినిమాతో మొదలు పెట్టి చిన్నదాన నీకోసం వరకు సినిమాల్లో పవన్‌ను అనుకరించాడు. ప్రతి సినిమాలో పవన్ కు సంబంధించిన విషయం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.పవన్ కూడా నితిన్‌పై ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తాడు.
అయితే తాజాగా జనసేన పార్టీకి హీరో నితిన్ తనవంతుగా రూ.25 లక్షల విరాళం ఇచ్చారు. వివరాల్లోకెళితే.. సోమవారం రాత్రి భీమవరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను నితిన్ తండ్రి, నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి కలిసి చెక్ అందచేశారు. డీ హైడ్రేషన్‌తో అస్వస్థతకు లోనైన పవన్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ…సోదరుడు నితిన్ నా ఆరోగ్యం గురించి వాకబు చేసినందుకు సంతోషంగా ఉంది. ఎంతో అభిమానంగా జనసేనకు విరాళం పంపించారు. నితిన్‌కు, సుధాకర్ రెడ్డికి కృతజ్ఞతలు అని పవన్ చెప్పుకొచ్చారు.








