25.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ రాజశేఖర్ కుమార్తె…విజయ్ దేవరకొండ తమ్ముడు నటించిన ‘దొరసాని’ టీజర్ విడుదల…  

రాజశేఖర్ కుమార్తె…విజయ్ దేవరకొండ తమ్ముడు నటించిన ‘దొరసాని’ టీజర్ విడుదల…  

- Advertisement -

హైదరాబాద్: సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక హీరోయిన్‌గా, యంగ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం దొరసాని. ఈ ఇద్దరు తొలిసారి ఈ చిత్రం ద్వారా వెండితెరకి పరిచయం అవుతున్నారు.

ఇక ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది.  ఈరోజు ఉదయం చిత్రబృందం టీజర్‌ని విడుదల చేయగా…ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

టీజర్ బట్టి చూస్తుంటే ఈ చిత్రం దొరల గడీల నేపథ్యంలో తెరకెక్కిందని అర్ధమవుతుంది. హీరోకి…తన ఫ్రెండ్స్‌కి మధ్యలో వచ్చే డైలాగులు అలరిస్తున్నాయి. అలాగే మొదటి సినిమా అయిన శివాత్మిక, ఆనంద్‌లు మంచి నటనతో ఆకట్టుకునేలా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి కే‌వి‌ఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

చదవండి: సైరా’ విడుదల తేదీ ఫిక్స్…
- Advertisement -