25.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ అందరికీ బర్త్ డే విషెస్ చెప్పిన బిగ్ బి అమితాబ్

అందరికీ బర్త్ డే విషెస్ చెప్పిన బిగ్ బి అమితాబ్

- Advertisement -

ముంబై: సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్ర‌స్తుతం త‌న ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్ర‌తి ఒక్క‌రికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

తాను ఎందుకు అలా చెప్ప‌వ‌ల‌సిందో ఓ లాజిక్ ద్వారా వివ‌రించారు. మీ వ‌య‌స్సు, మీరు పుట్టిన సంవ‌త్స‌రాన్ని క‌లిపితే ఈ సంవ‌త్సరం అంటే 2020 వ‌స్తుంద‌ని, ఇది ప్ర‌తి వెయ్యి సంవ‌త్స‌రాల‌కి వ‌స్తుంద‌ని వివ‌రించారు.

అమితాబ్ ఇలా చెప్పారో లేదో ప్ర‌తి ఒక్క‌రు ఆ లాజిక్‌ని ఫాలో అవుతూ తెగ షేర్‌లు చేస్తున్నారు.

బిగ్ బి ఇటీవల  ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ) షో ప్రోమో షూటింగ్‌లో పాల్గొన్నారు.  అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకొనే షూటింగ్‌లో పాల్గొన్నామని,  రెండు రోజుల‌లో చేయ‌వ‌ల‌సిన దానిని ఒక్క రోజులోనే పూర్తి చేశామని పేర్కొన్నారు.

ఒకే రోజు జ‌రిగిన షూటింగ్‌లో అమితాబ్ దాదాపు 12 వీడియోల‌లో న‌టించార‌ట‌. కేబీసీ 12 ప్రోమోతో పాటు కరోనా చికిత్స కోసం పోరాడుతున్న డాక్టర్లు, నర్సులను ప్రోత్సహించే వీడియోల‌లో కూడా న‌టించార‌ని స‌మాచారం.

మే 9 న రాత్రి 9 గంటల నుంచి ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి రిజిస్ట్రేష‌న్  ప్రారంభం కానుంది. 

- Advertisement -