యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదన్న కేటీఆర్.. థ్యాంక్స్ చెప్పిన విజయ్ దేవరకొండ

2:04 pm, Sun, 15 September 19
ktr-vijay-deverakonda

హైదరాబాద్: నల్లమలలో యురేనియం తవ్వకాలకు కేంద్రం సిద్ధమవుతున్న వేళ సినీ తారలు, రాజకీయ ప్రముఖులు ఒక్కటవుతున్నారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వీల్లేదంటూ ఇప్పటికే చాలామంది తేల్చి చెప్పారు.

తాజాగా ఇవాళ అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ యూరేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదని సభకు తెలిపారు. కేటీఆర్ ప్రకటనపై హీరో విజయ్ దేవరకొండ స్పందించాడు. ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.

“మనమంతా కలిశాం. మన విజ్ఞప్తులను వారు విన్నారు. నల్లమలను కాపాడుకునేందుకు అడుగులు పడుతున్నాయి. మన ప్రయత్నాలను మాత్రం ఆపొద్దు, అమ్రాబాద్, నల్లమల ప్రజలకు నా పూర్తి మద్దతు ఉంటుంది.

నాతో పాటు లక్షలాది మంది సోదర సోదరీమణులు మీ వెనుకే ఉన్నారు” అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు. దీనిపై కేటీఆర్ స్పందించడం తాము సాధించిన తొలి విజయమని పేర్కొన్నాడు.