యాపిల్ కంపెనీ సంచలన నిర్ణయం! త్వరలో ‘యాపిల్ పే’ క్రెడిట్ కార్డు, ప్రత్యర్థి కంపెనీలకు షాక్ ఇచ్చే ఆఫర్లు!!

- Advertisement -

వాషింగ్టన్: యాపిల్ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకొంది. బ్యాంకింగ్ రంగంలోకి ఎంటర్ కావాలి అని నిర్ణయించుకొంది.  అందులో భాగంగా యాపిల్ క్రెడిట్ కార్డు విడుదల చేయబోతోంది. 2019 మార్చినాటికి ప్రజల చేతిలో తన ‘యాపిల్ పే’  క్రెడిట్ కార్డు పెట్టాలి అని భావిస్తోంది. ఇందుకోసం ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు గోల్డ్ మెన్ సంస్థతో ఒప్పందం చేసుకోబోతోంది.

ప్రస్తుతం మార్కెట్లో మాస్టర్ కార్డు వీసా కార్డు లభిస్తున్నాయి. ఈ రెండు కార్డులూ అమెరికా సంస్థలకి సంబంధించినవే. ఇప్పుడు యాపిల్ కూడా ఈ రంగంలోకి ప్రవేశిస్తుండడంతో వీటి మధ్య ఇక పోటీ ఏర్పడనుంది.  ప్రస్తుతం మార్కెట్లో ఉన్న క్రెడిట్ కార్డలు, అవి ఇస్తున్న ఆఫర్ల కంటే మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లుతో యాపిల్ మార్కెట్లోకి దిగనున్నట్లు సమాచారం.  అంతేకాకుండా, క్రెడిట్ కార్డులు ద్వారా ప్రపంచవ్యాప్తంగా తన ఉత్పత్తుల అమ్మకాలను మరింత పెంచుకోవాలని కూడా యాపిల్ కంపెనీ భావిస్తోంది.

ఈ యాపిల్ క్రెడిట్ కార్డు ద్వారా యాపిల్ ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయవచ్చు. వడ్డీ లేని రుణం ఇవ్వడంతో పాటు ఆయా ఉత్పత్తులపై మరింత డిస్కౌంట్ ఇచ్చేలాగా యాపిల్ తన ‘యాపిల్ పే’ క్రెడిట్ కార్డును మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా.   కంప్యూటర్లు, లాప్ ట్యాప్ లు, వాచీలు, ఐ ఫోన్లు… ఇలా యాపిల్ కంపెనీ ఉత్పత్తులు కొనుగోలు చేసేటప్పుడు యాపిల్ క్రెడిట్ కార్డు ద్వారా వడ్డీ లేని రుణంతోపాటు మరింత డిస్కౌంట్ లభిస్తుంది.

అయితే యాపిల్ కంపెనీకి ఈ క్రెడిట్ కార్డు వ్యాపారం కొత్తేం కాదు. ఇప్పటికే బార్క్లేస్ బ్యాంకు క్రెడిట్ కార్డులను యాపిల్ సంస్థ అందిస్తోంది. ఇప్పుడు మాత్రం సొంతంగా యాపిల్ పే క్రెడిట్ కార్డు విడుదల చేస్తోంది.  బ్యాంకింగ్ రంగంలోకి యాపిల్ కంపెనీ అడుగుపెట్టబోతున్నట్లు వాల్ స్ట్రీట్ జనరల్ పత్రిక ఇప్పటికే కథనాలు ప్రచురించింది. ఐ.టి ఉద్యోగులు, యువతను దృష్టిలో ఉంచుకుని యాపిల్  తన క్రెడిట్ కార్డును రూపొందిస్తోన్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

 

 

- Advertisement -

1 COMMENT

  1. Good day very nice web site!! Guy .. Beautiful .. Wonderful ..
    I will bookmark your website and take the feeds also? I’m happy to find numerous helpful information here in the post,
    we need develop extra techniques on this regard, thanks
    for sharing. . . . . .