- Advertisement -
విశాఖపట్నం: సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వస్తే వైఎస్ లాంటి పరిపాలన జగన్ అందిస్తారని అన్నారు. ప్రజల కోసం జగన్ నవరత్నాలు తీసుకొస్తున్నారని తెలిపారు. చంద్రబాబు మాత్రం ఒక రత్నం తెచ్చారని..అదే ఆయన పుత్రరత్నం అని ఎద్దేవా చేశారు. టీడీపీ సైకిల్‌కి బీజేపీ, జనసేన రెండు చక్రాలని..ఇప్పుడు ఊడిపోయాయని వ్యాఖ్యానించారు. జగన్ పాదయాత్రతో చంద్రబాబుకు మతిభ్రమించిందన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తులను పిచ్చాస్పత్రుల్లో చేర్పించాలని విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.
- Advertisement -