హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన మహర్షి సినిమా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. మే9 న విడుదలైన ఈ సినిమా వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 59.37 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. ఒక్క నైజామ్ లోనే 21.67 కోట్ల షేర్ ను సాధించడం విశేషం. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 80కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. మహేశ్ బాబు కెరియర్లోనే ఇవి అత్యధిక వసూళ్లు.
చదవండి: ‘మహర్షి’పై వెంకయ్యనాయుడు రివ్యూ!
అయితే ఈ సినిమా మొత్తం 100 కోట్లకి అమ్ముడుపోయింది. దీని ప్రకారం ఇంకో 20కోట్లు వస్తే హిట్‌గా నిలుస్తుంది. ఈ వారంలో 20 కోట్లు కూడా వచ్చేసేలా ఉన్నాయి. ఇంకా 100 కోట్లు దాటి ఎంత వచ్చిన సినిమా లాభాల బాట పట్టినట్లే.
కాగా, మహేశ్ 25వ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకి తగ్గట్టుగానే సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. సమ్మర్ హాలిడేస్ కావడం మహర్షికి బాగా కలిసొచ్చింది.








