తెలుగు బాక్సాఫీసు వద్ద రికార్డులు కొల్లగొడుతున్న ‘కాంచన 3’…

Kanchana 3 Latest News, Telugu Movie News, Raghava Lawrence News, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: స్టార్ హీరో , డైరెక్టర్ రాఘవ లారెన్స్ తన స్వీయ దర్శకత్వంలో కాంచన సిరీస్ ని విజయవంతంగా నడిపిస్తున్నాడు. ఇప్పటి వరకు కాంచన సిరీస్ లో వచ్చిన అన్ని చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. కాంచన 3 చిత్రం ఏప్రిల్ 19న విడుదలై తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించింది. వేదిక, ఓవియా, నిక్కి తంబోలి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు.

హర్రర్ కామెడీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంతో లారెన్స్ మరోసారి మ్యాజిక్ చేశాడు. కాంచన 3 చిత్రం బి, సి సెంటర్స్ లో వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. కాంచన 3 చిత్రం విడుదలై నెలరోజులు గడుస్తున్న నేపథ్యంలో తెలుగులో ఈ చిత్ర వసూళ్ల గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మాత ఠాగూర్ మధు విడుదల చేశారు. కాంచన 3 ద్వారా అన్ని ఖర్చులు పోను ఆయనకు దాదాపు 10 కోట్ల లాభం వచ్చినట్లు తెలుస్తోంది.

లారెన్స్ సినిమా తెలుగులో ఈస్థాయిలో లాభాలు తెచ్చిపెట్టడం విశేషమే. వాస్తవానికి కాంచన 3చిత్రానికి కాస్త నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. కానీ దాని ప్రభావం బి,సి సెంటర్స్ పై పడలేదు. మాస్ ప్రేక్షకులు కాంచన 3 చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేశారు. తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రం 100 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది.

- Advertisement -