24.2 C
Hyderabad
Sunday, November 29, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ ప్రభుదేవా జ్ఞాపకాలను పూర్తిగా చెరిపేసుకున్న నయనతార!

ప్రభుదేవా జ్ఞాపకాలను పూర్తిగా చెరిపేసుకున్న నయనతార!

- Advertisement -

చెన్నై: దక్షిణాది చిత్ర సీమలో అగ్రనటిగా వెలుగొందుతున్న నయనతార చేతిపై నిన్నటివరకు కనిపించిన మాజీ ప్రియుడు ప్రభుదేవా పేరున్న టాటూ ఇప్పుడు మాయమైంది.

అతడితో పీకల్లోతు ప్రేమలో ఉన్న సమయంలో, ఆమె తన ఎడమ చేతిపై ఆ పేరును పచ్చబొట్టుగా వేయించుకుంది. అంతకుముందు తమిళ హీరో శింబుతో ప్రేమలో నిండా మునిగిన నయన్, బ్రేకప్ తరువాత.. ప్రభుదేవాకు దగ్గరైంది.

వీరిద్దరికీ పెళ్లి ఖాయమని అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ, ఆ ప్రేమ కూడా వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం నయనతార, విఘ్నేశ్ శివన్‌తో ప్రేమలో మునిగి తేలుతోంది.

చానాళ్ల నుంచే వీరి ప్రేమ కొనసాగుతోంది. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్న చిత్రాలు నెట్టింట కొన్ని దర్శనమిస్తున్నాయి. తాజాగా, ‘ప్రభుదేవా’ అన్న పేరుండాల్సిన చోట ‘పాజిటివిటీ’ అన్న అక్షరాలను నయన్ వేయించుకుంది.

ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

- Advertisement -