22.7 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం జియో గిగా ఫైబర్‌లో ఈ ప్లాన్ తీసుకుంటే.. 43 అంగుళాల టీవీ ఉచితం!

జియో గిగా ఫైబర్‌లో ఈ ప్లాన్ తీసుకుంటే.. 43 అంగుళాల టీవీ ఉచితం!

jio-fiber
- Advertisement -

ముంబై: టెలికం రంగంలోకి అడుగుపెట్టి ప్రత్యర్థులకు కునుకు లేకుండా చేస్తున్న రిలయన్స్ జియో మరో సంచలనంతో వచ్చేసింది. నిన్న(సెప్టెంబర్ 5) దేశవ్యాప్తంగా గిగాఫైబర్ సేవలను ప్రారంభించింది.

అయితే, జియో గిగాఫైబర్ ప్లాన్లు, ధరల విషయంలో వినియోగారుల్లో ఇప్పటికీ కొంత అస్పష్టత ఉంది. ఈ నేపథ్యంలో జియో గిగాఫైబర్ ప్లాన్లు, ధరలు తదితర వాటి వివరాలు ‘న్యూస్ఎక్స్‌ప్రెస్’ పాఠకుల కోసం ప్రత్యేకం

మొత్తం ఆరు ప్లాన్లు…

జియో ఫైబర్‌లో మొత్తం ఆరు రకాల ప్రీపెయిడ్ ప్లాన్లు ఉన్నాయి. ఇందులో బ్రాంజ్ (రూ.699), సిల్వర్ (రూ.849), గోల్డ్ (1,299), డైమండ్ (రూ.2,499), ప్లాటినం (రూ.3,999), టైటానియం (రూ.8,499) ప్లాన్లు ఉన్నాయి.

బ్రాంజ్, సిల్వర్ ప్లాన్లలో డేటా స్పీడ్ 100 ఎంబీపీఎస్ కాగా, గోల్డ్, డైమండ్‌ ప్లాన్లలో రూ.250/500 ఎంబీపీఎస్, ప్లాటినం, టైటానియం ప్లాన్లలో 1జీబీపీఎస్ డేటా స్పీడ్ లభిస్తుంది. మూడు నెలలు, 6 నెలలు, ఏడాది కాలపరిమితో ఇవి అందుబాటులో ఉన్నాయి.

అపరిమిత డేటా.. హోం ల్యాండ్‌లైన్…

జియో ఫైబర్‌లోని అన్ని ప్లాన్లలోనూ డేటాను అపరమితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అప్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే, బ్రాంజ్ ప్లాన్‌లో 100జీబీ నుంచి టైటానియం ప్లాన్‌లో 5000 జీబీ వరకు పీయూఎఫ్ పరిమితి ఉంది.ప్రతీ ఇంటర్నెట్ కనెక్షన్‌తోనూ హోం ల్యాండ్‌లైన్ సర్వీస్ లభిస్తుంది. టీవీ వీడియో కాలింగ్, గేమింగ్, 5 డివైజ్‌ల వరకు నార్టన్ యాంటీ వైరస్ లభిస్తుంది.

ఇదీ వెల్‌కం ఆఫర్…

జియో ఫైబర్ వార్షిక ప్లాన్ తీసుకున్న వారికి జియో హోం గేట్ వే డివైజ్ (రూ.5000), 4కె సెట్ టాప్ బాక్స్ (రూ.6,400), రెండు నెలల అదనపు సేవలు లభిస్తాయి. అలాగే, డేటా కూడా రెండింతలు లభిస్తుంది.

దీంతోపాటు అదనంగా జియో సినిమా, జియో సావన్ యాప్స్‌కు మూడు నెలల పాటు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ఇది బ్రాంజ్ వినియోగదారులకు మాత్రమే.

సిల్వర్ ప్లాన్ ఖాతాదారులకు మూడు నెలల పాటు ఓటీటీ యాప్స్ సబ్‌ స్క్రిప్షన్ లభిస్తుంది. గోల్డ్, డైమండ్, ప్లాటినం ఖాతాదారులకు ఏడాదిపాటు ఓటీటీ యాప్స్ సేవలు ఉచితంగా లభిస్తాయి.

గోల్డ్ వార్షిక ప్లాన్..

జియో ఫైబర్ గోల్డ్ వార్షిక ప్లాన్‌లో ‘మ్యూజ్ 2 బ్లూటూత్’ స్పీకర్ ఉచితంగా లభిస్తుంది. సిల్వర్ ప్లాన్‌లో ‘థంబ్ 2 బ్లూటూత్’ స్పీకర్లు ఉచితంగా లభిస్తాయి. డైమండ్, ప్లాటినం వార్షిక ప్లాన్లలో వివిధ అంగుళాల్లో ఉన్న హెచ్‌డీ టీవీ ఉచితంగా లభిస్తుంది.

గోల్డ్ ప్లాన్‌ ఖాతాదారులకైతే 24 అంగుళాల హెచ్‌డీ టీవీ లభిస్తుంది. అయితే ఇందుకు రెండేళ్ల ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక టైటానియం వార్షిక ప్లాన్‌లో 43 అంగుళాల 4కె టీవీ ఉచితంగా లభిస్తుంది.

ఆరు నెలల ప్లాన్లలో అదనంగా నెల రోజులతోపాటు 50 శాతం అదనపు డేటా లభిస్తుంది. మూడు నెలల ప్లాన్లలో కేవలం 25 శాతం అదనపు డేటా లభిస్తుంది.

ఇన్‌స్టాలేషన్ చార్జీలు ఇలా…

జియో కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కానీ, మై జియో యాప్ ద్వారా కానీ జియో ఫైబర్‌ను బుక్ చేసుకోవచ్చు. జియో ఫైబర్ సర్వీసు మీ ప్రాంతంలో అవైలబుల్‌లో ఉన్నట్టైతే జియో ప్రతినిధి వెంటనే మిమ్మల్ని సంప్రదిస్తారు.

అయితే ఇన్‌స్టాలేషన్ చార్జ్ కింద రూ.2500 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రూ.1500 రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్. మిగతా వెయ్యి రూపాయలు నాన్ రిఫండబుల్.

సంబంధిత వార్తలు

గుడ్‌ న్యూస్! ‘జియో ఫైబర్’ కనెక్షన్‌తో ‘సెట్‌టాప్ బాక్స్’ ఉచితం, ఇంకా…
నేడే ‘జియో ఫైబర్’ లాంచింగ్! రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా…
- Advertisement -