32.2 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ ‘రాక్షసుడు’తో బెల్లంకొండకు బ్రేక్.. ట్విట్టర్ రివ్యూ

‘రాక్షసుడు’తో బెల్లంకొండకు బ్రేక్.. ట్విట్టర్ రివ్యూ

- Advertisement -

టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ సినీ వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సాయి శ్రీనివాస్ విభిన్నమైన సినిమాలు చేస్తున్నా ఇప్పటి వరకు సరైన బ్రేక్ రాలేదు. ఈ ఏడాది ‘సీత’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అంతగా మెప్పించలేకపోయాడు. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. అయితే, ఇప్పుడు ‘రాక్షసుడు’ అనే సైకలాజికల్ థ్రిల్లర్‌తో శ్రీనివాస్ ప్రేక్షకులను మెప్పించేందుకు వచ్చాడు.

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘రాచ్చసన్’ సినిమాకు ‘రాక్షసుడు’ రీమేక్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించారు. రమేశ్ వర్మ దర్శకత్వం వహించాడు. దేవీశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ డైలాగులు రాశాడు. ఎ స్టూడియోస్ ఎల్ఎల్‌పీ బ్యాన‌ర్‌పై కోనేరు స‌త్యనారాయ‌ణ ఈ సినిమాను నిర్మించారు. ట్రైలర్‌తో సినిమాపై ఆసక్తిని రేకెత్తించిన ‘రాక్షసుడు’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కన్నా ముందుగానే చూసేసిన అమెరికాలోని తెలుగువారు ఈ సినిమాపై ట్విట్టర్‌లో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

‘రాక్షసుడు’ సినిమా చాలా బాగుందంటూ ప్రశంసిస్తున్నారు. ‘రాక్షసుడు’ సాయి శ్రీనివాస్ మెప్పించాడని కొనియాడుతున్నారు. గత సినిమాలతో పోలిస్తే ఇందులో ఆయన నటన చాలా బాగుందని పేర్కొన్నారు. స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉందని, అదే ఈ సినిమాకు ప్రధాన బలమని చెబుతున్నారు. తరవాత ఏం జరుగుతుందన్న సస్పెన్స్‌ను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని అంటున్నారు. అయితే, ఈ సినిమాను తమిళంలో ఇప్పటికే చూసేసిన వారికి మాత్రం పెద్దగా థ్రిల్ అనిపించకపోవచ్చంటున్నారు. సెకండాఫ్‌ను యాజిటీజ్‌గా దించేయడమే అందుకు కారణమని అంటున్నారు.

జిబ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ సినిమాకు మరో బలమని, ఇంటర్వెల్ బ్లాక్ అయితే అదిరిపోయిందని ట్వీట్లు చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే సినిమా చాలా బాగుందని, ఎంగేజింగ్ థ్రిల్లర్ అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాతో సాయి శ్రీనివాస్‌కు బ్రేక్ పక్కా అని చెబుతున్నారు.

- Advertisement -