26.2 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ టీడీపీకి మరో షాక్.. త్వరలో వైసీపీలోకి బోండా ఉమ?

టీడీపీకి మరో షాక్.. త్వరలో వైసీపీలోకి బోండా ఉమ?

- Advertisement -

అమరావతి: టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. విజయవాడ రాజకీయాల్లో ప్రస్తుతం ఈ వార్త చర్చనీయాంశమైంది. పార్టీలోకి వస్తే తూర్పు బాధ్యతలను అప్పగిస్తామని బోండా వద్ద వైసీపీ ప్రతిపాదన తెచ్చినట్టు సమాచారం. అయితే, ఈ వార్తలను ఆయన ఖండించినప్పటికీ వార్తలకు మాత్రం ఫుల్‌స్టాప్ పడడం లేదు.

బోండా ఉమ ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 25 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు ఈ స్థానం నుంచి స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించారు. దీనిపై బొండా ఉమా రీకౌంటింగ్‌ డిమాండ్‌ చేసినా ఎన్నికల అధికారి అనుమతించలేదు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి పిటిషన్‌ దాఖలు చేసిన ప్రయోజనం లేకుండా పోయింది.

2014 ఎన్నికల్లో తొలిసారి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బొండా ఉమా జయకేతనం ఎగురవేశారు. అంతకుముందు టీడీపీలో పలు పదవులు నిర్వహించారు. గత ఎన్నికల్లో గెలిచిన ఆయన సామాజిక వర్గాల సమీకరణలో మంత్రి పదవిని ఆశించినా దక్కలేదు. దీంతో కొంత అసహనం వ్యక్తం చేశారు. మంత్రి పదవిని ఇవ్వలేకపోవడంతో చంద్రబాబు ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యునిగా నియమించారు. ఎన్నికలు అయ్యేంత వరకు ఆ పదవిలో కొనసాగారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బోండా ఉమ ఓటమి పాలైన తర్వాత ఆయన తన సామాజికవర్గ సమావేశాల్లో పాల్గొన్నారు. కాకినాడలో జరిగిన కాపు సామాజిక వర్గ నేతల సమావేశానికి హాజరయ్యారు. ఆ రోజే ఆయన పార్టీ మారబోతున్నారన్న ప్రచారం జరగినా ఉమ ఇటీవల ఆయన న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లారు. కువరవ్‌ వంతెన వద్ద గత నెల 31న ఉదయం 43 మీటర్ల ఎత్తునుంచి బంజీ జంప్‌ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన ఆయన ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం రాజకీయాల్లోనూ తీసుకుంటానని ఆయన ప్రకటించి మరోమారు చర్చకు తెరతీశారు. అయితే, ఆయన చూపు వైసీపీవైపా? లేక బీజేపీలో చేరతారా? అన్నది మాత్రం తెలియరాలేదు.

https://www.facebook.com/BondaUma/videos/347588736179029/?v=347588736179029

- Advertisement -