34.1 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ అమెరికాలో సామాన్యుడిలా చంద్రబాబు! రోడ్లపై తిరుగుతూ.. చిరుతిళ్లు తింటూ ఎంజాయ్!

అమెరికాలో సామాన్యుడిలా చంద్రబాబు! రోడ్లపై తిరుగుతూ.. చిరుతిళ్లు తింటూ ఎంజాయ్!

- Advertisement -

అమరావతి: కుటుంబంతో కలిసి అమెరికా పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అత్యంత సాధారణ వ్యక్తిలా నడివీధుల్లో సంచరించారు. చిరుతిళ్లు తింటూ జాలీగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వీధుల్లో నడుస్తూ, అంగళ్లలోని చిరుతిళ్లు కొనుక్కుని చేతితో తింటూ ఆ ప్రాంతంలో తిరిగారు. అదే సమయంలో ఆయన వెంట ఉన్న నేతల్లో ఒకరు ‘‘సార్ మేడమ్ లేరు కదా.. ఓ ఐస్‌క్రీం తింటారా?’’ అనడం వినిపించింది. దీనికి చంద్రబాబు.. ‘‘వద్దు.. రా’’ అంటూ బదులిచ్చారు.

కాగా, అమెరికాలో వైద్య పరీక్షల కోసం వెళ్లిన చంద్రబాబు మిన్నెసొటలోని మేయా క్లినిక్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. చంద్రబాబు అమెరికా పర్యటన సందర్భంగా అక్కడి తెలుగు సంఘాల ప్రతినిధులు జయరామ్‌ కోమటి, సతీశ్‌ వేమన, రామ్‌ చౌదరి తదితరులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

 

- Advertisement -