28.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఆలయాలు, ట్రస్టులపై జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఆలయాలు, ట్రస్టులపై జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఆలయాలు, ట్రస్టుల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాలు, ట్రస్టుల పాలక మండళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు సముచిత స్థానం కల్పించాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. వాటి పాలక మండళ్లలో 50 శాతం పదవులను వీరికి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును శాసనసభ గురువారం ఆమోదించింది. అలాగే, మొత్తం పదవుల్లో 50 శాతం మహిళలకు కేటాయించేలా బిల్లుకు చేసిన సవరణను కూడా అసెంబ్లీ ఆమోదించింది.

ఇకపై ఆలయాలు, ట్రస్టుల పాలక మండళ్ల సభ్యులు ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, అక్రమాలకు పాల్పడినా వారిని పదవీకాలం ముగియడానికి ముందే తొలగించేలా ఈ బిల్లు రూపొందించారు. ఆలయాల పరిరక్షణ, పవిత్రత కాపాడేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆలయాల పాలక మండళ్లలో సామాజిక న్యాయం చేసేందుకే ఈ బిల్లును తీసుకువచ్చినట్టు చెప్పారు.

- Advertisement -