22.7 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ కాళేశ్వరం: ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన కేసీఆర్, పాల్గొన్న గవర్నర్, సీఎంలు…

కాళేశ్వరం: ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన కేసీఆర్, పాల్గొన్న గవర్నర్, సీఎంలు…

kaleswaram-project-inauguration
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రజల జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టును శుక్రవారం సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. ముఖ్య అతిథులుగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరుకాగా, తెలంగాణ మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

యుద్ధప్రాతిపదికన నిర్మించిన ఈ ప్రాజెక్టు తెలంగాణలోని అత్యధిక జిల్లాలకు సాగు, తాగు నీరు అందించనుంది. అలాగే పారిశ్రామిక అవసరాలను కూడా తీర్చనుంది. కాళేశ్వరం ప్రాజెక్టును 3 బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 20 పంపుహౌసుల సమాహారంగా రూపొందించారు. దాదాపు 37.08 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు నీరు అందించనుంది.

kaleswaram-project-kcr-jalasankalpa-yagam

కేసీఆర్ దంపతుల జలసంకల్ప యాగం…

మేడిగడ్డకు చేరుకోగానే అక్కడ వేదపండితులు ప్రతిష్ఠించిన గోదావరి మాత విగ్రహానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత శృంగేరి పీఠానికి చెందిన అర్చకులు ఏర్పాటు చేసిన జలసంకల్ప యాగంలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. పూర్ణాహుతి అనంతరం ముహుర్తం సమయానికి ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి శిలాఫలకాలను ఆవిష్కరించి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు శిలాఫలకాన్ని ఆవిష్కరించగా, సీఎం కేసీఆర్ రిబ్బన్ కత్తిరించి మేడిగడ్డ బ్యారేజిని ప్రారంభించారు. అనంతరం అక్కడి పంప్‌హౌస్‌లోని 6వ నంబర్ మోటారును ఆన్ చేయడం ద్వారా ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ ప్రారంభించారు.

అనంతరం మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ సమగ్ర స్వరూపాన్ని వివరిస్తూ ప్రదర్శించిన డాక్యుమెంటరీని గవర్నర్, కేసీఆర్, జగన్, ఫడ్నవీస్ వీక్షించారు. వారికి ప్రాజెక్టు వివరాలను కేసీఆర్ స్వయంగా వివరించారు.

ఆ తరువాత అతిథులతో కలిసి మేడిగడ్డ బ్యారేజికి అనుబంధంగా నిర్మించిన బ్రిడ్జిగుండా సీఎం కేసీఆర్ మహారాష్ట్ర సరిహద్దుల వరకు వెళ్లారు. అక్కడ్నించి హెలికాఫ్టర్‌లో కన్నేపల్లి వద్దకు చేరుకున్న కేసీఆర్ అక్కడి పంప్‌హౌస్‌ను ప్రారంభించారు.


 

- Advertisement -