21.7 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ  స్థానికపోరులో టీఆర్ఎస్ హవా….32 జెడ్పీ స్థానాలు కారు కైవసం…

 స్థానికపోరులో టీఆర్ఎస్ హవా….32 జెడ్పీ స్థానాలు కారు కైవసం…

Telangana Rashtra Samithi proves grip over rural areas in local body elections
- Advertisement -

హైదరాబాద్: ఇటీవల వెలువడిన లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన మేర ఫలితాలు సాధించలేకపోయిన టీఆర్ఎస్ పార్టీ… స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం దుమ్ములేపింది. గత నెలలో మూడు దశల్లో 5817 ఎంపీటీసీలకు, 538 జెడ్పీటీసీ స్థానాలకి ఎన్నికలు జరిగాయి.

ఆ ఎన్నికలకి సంబంధించిన ఫలితాలు నిన్న వెలువడ్డాయి. మొత్తం 5817 స్థానాలకి గాను 3,556 చోట్ల (62శాతం) టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా…కాంగ్రెస్‌ అభ్యర్థులు 1,377 చోట్ల (24శాతం) గెలుపొందారు.

ఇక స్వతంత్రులు, కొన్ని ఇతర పార్టీల వారు కలిపి 573 స్థానాలు (10శాతం) గెలుపొందగా, బీజేపీ 211, టీడీపీ 21 ఎంపీటీసీ స్థానాలను గెలిచాయి. ఇక మొత్తం 538 జడ్పీటీసీల్లో టీఆర్ఎస్‌కు 448 (83శాతం), కాంగ్రెస్‌కు 76 (14శాతం), బీజేపీకు 8, ఇతరులకు 6 స్థానాలు గెలుచుకున్నాయి.

ఈ నెల 7, 8 తేదీల్లో జరిగే పరోక్ష ఎన్నికల్లో మొత్తం 32 జడ్పీ పీఠాలు, 382 ఎంపీపీలు టీఆర్ఎస్ సొంతం కానున్నాయి. మొత్తం జడ్పీటీసీల్లో సగం కంటే ఒక్క స్థానం ఎక్కువొచ్చిన పార్టీకే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు దక్కుతాయి. అంటే రాష్ట్రంలోని మొత్తం 32 జెడ్పీ పీఠాలు టీఆర్‌ఎస్‌కే దక్కనున్నాయి.

చదవండి: బిగ్ బ్రేకింగ్: సైబర్ క్రైం పోలీసులకి లొంగిపోయిన టివి9 రవిప్రకాశ్!
- Advertisement -