25 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ కేశినేని, సీఎం రమేశ్‌లకు కీలక బాధ్యతలు అప్పజెప్పిన చంద్రబాబు..

కేశినేని, సీఎం రమేశ్‌లకు కీలక బాధ్యతలు అప్పజెప్పిన చంద్రబాబు..

Chandrababu Naidu News, Kesineni Latest News, AP Political News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: తెలుగుదేశం ఎంపీలు కేశినేని నాని, సీఎం రమేశ్‌లకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. లోక్‌సభలో టీడీపీ ఉపనేతగా, పార్టీ విప్‌ బాధ్యతలని ఎంపీ కేశినేని నానికి అప్పగించగా…. సీఎం రమేశ్‌ను రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎన్నుకున్నారు.

అయితే ఇటీవల లోక్‌సభ టీడీపీ పక్ష నేతగా రామ్మోహన్‌నాయుడుని ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఇక రాజ్యసభలో టీడీపీ పక్ష నేతగా సుజనాచౌదరి, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్‌ వ్యవహరించనున్నారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు ఈ నెల 7న విదేశీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో మంగళవారం అమరావతిలోని తన నివాసంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. తాను లేని సమయంలో రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై దాడుల విషయంలో ఈ సందర్భంగా నేతల ఆందోళన వ్యక్తం చేశారు.

అలాగే తెలంగాణలోని ఏపీ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ ఇటీవల గవర్నర్ నరసింహన్ తీసుకున్న నిర్ణయంపైనా సమావేశంలో చర్చించారు. గవర్నర్ నిర్ణయం ఏకపక్షమని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు.

చదవండి: ఆ రోజు వస్తే చంద్రబాబుకి చెప్పే రాజీనామా చేస్తా…
 
- Advertisement -