
హైదరాబాద్: యంగ్ హీరో విశ్వక్ సేన్…నటించిన తాజా చిత్రం ఫలక్‌నుమా దాస్. శుక్రవాదం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. చిత్రబృందం రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ…విజయోత్సవ వేడుకలని జరుపుకుంటున్నారు.
ఈ క్రమంలోనే నిన్న విజయవాడలో పర్యటించింది. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ…విజయ్ దేవరకొండ అభిమానులపై ఫైర్ అయ్యారు. ‘ఫలక్ నుమా దాస్’ చిత్రంపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడంపై విశ్వక్ స్పందించారు.
తన సినిమాకు అడ్డంకులు సృష్టించాలని చూస్తే, చూస్తూ ఊరుకునేది లేదని విశ్వక్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక సోషల్ మీదితన అభిమానుల కామెంట్ల వెనుక విజయ్ దేవరకొండ ఉన్నాడని విశ్వక్ ఆరోపిస్తున్నారు.
అలాగే తన అభిమానులను విజయ్ కంట్రోల్ చేయాలని, తాను హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించి, సక్సెస్ మీట్‌ను పెట్టనున్నానని స్పష్టం చేశాడు. మరి చూడాలి ఈ తెలంగాణ హీరోల వివాదం ఎంతవరకు వెళుతుందో.








