29.5 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ టాలీవుడ్: పవన్ రీ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్న బండ్ల గణేశ్…

టాలీవుడ్: పవన్ రీ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్న బండ్ల గణేశ్…

- Advertisement -

హైదరాబాద్: ఇటీవల ముగిసిన ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ పార్టీ కేవలం ఒక్క సీటుని మాత్రమే గెలుచుకుంది. ఇక పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

అయితే జనసేనకి ప్రతిపక్షంలో ఉండి కొత్త ప్రభుత్వం మీద పోరాడడానికి కొంత సమయం పడుతుంది. దీంతో పవన్ ఈ గ్యాప్‌లో ఓ సినిమా చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ తో ఒక భారీ బడ్జెట్ చిత్రం చేయడానికి బండ్ల గణేశ్ సిద్ధమవుతున్నాడట. ఇప్పటికే పవన్ తో సంప్రదింపులు మొదలుపెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు.

అయితే పవన్‌కి పారితోషికంగా 40 కోట్లు ఇస్తానని చెప్పినట్టుగా సమాచారం. ఇక దర్శకుడిగా బోయపాటిని సెట్ చేసే ప్రయత్నం కూడా చేశాడనీ, ఆయనకి 10 కోట్ల పారితోషికాన్ని ఆఫర్ చేశాడని అంటున్నారు.

అలాగే మిగతా ఆర్టిస్టుల పారితోషికాలు .. ఇతర ఖర్చులన్నీ కలుపుకుని మరో 50 కోట్ల ఖర్చుతో ఈ సినిమాను పూర్తి చేయాలనే ఆలోచనలో బండ్ల గణేశ్ ఉన్నాడని అంటున్నారు.

ఇదిలా ఉంటే పవన్ తో సినిమా వార్తలపై బండ్ల గణేశ్ స్పందించారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ట్వీట్ పెడుతూ, ఇది నిజం కాదని స్పష్టం చేశారు. తన బ్యానర్ లో ఏ సినిమా కూడా ఇంతవరకూ ఫైనలైజ్ కాలేదన్నారు. ఏదైనా సినిమా ఉంటే మొట్టమొదట అనౌన్స్ చేసేది తానేనని అన్నారు.

చదవండి: జూలై 12న వస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’…
- Advertisement -