25.2 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం దీదీ ఈ మధ్య ఎక్కువ అసహనంతో ఉన్నారు: మమతపై మోడీ సెటైర్

దీదీ ఈ మధ్య ఎక్కువ అసహనంతో ఉన్నారు: మమతపై మోడీ సెటైర్

- Advertisement -

 

ఢిల్లీ: ప్రధాని మోడీ మరోసారి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు పశ్చిమ బెంగాల్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ…మమతపై ఫైర్ అయ్యారు.

ఇటీవల పశ్చిమ బెంగాల్ లో కొందరు వ్యక్తులు జై శ్రీరామ్ నినాదాలు చేయగా, మమత వారిపై తీవ్రంగా మండిపడినట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ నేపథ్యంలో మోడి కవ్వింపు చర్యలకి దిగారు.

చదవండి: సీతారాం ఏచూరి పేరు మార్చుకుంటే మంచిదేమో: శివసేన

తాను కూడా జై శ్రీరామ్ నినాదాలు చేస్తానని, తనను అరెస్ట్ చేయించగలరా? అంటూ ఆగ్రహంతో మమతని ప్రశ్నించారు. జై శ్రీరామ్ నినాదాలు చేస్తే జైల్లో పెట్టిస్తారా? ఏదీ, నేను కూడా జై శ్రీరామ్ అంటాను, నన్ను జైల్లో పెట్టించు, చూద్దాం!” అంటూ వ్యాఖ్యానించారు.

అయితే ఈ మధ్య దీదీ తీవ్ర అసహనంతో ఉన్నారని, దేవుడి గురించి మాట్లాడడంలేదని, దేవుడి గురించి వినడంలేదని అన్నారు. ఇక ఆమె ప్రధాని కావాలని ఆశపడుతున్నారని, ఈ ఎన్నికల్లో ఆమెకు సొంత రాష్ట్రంలో పది సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.

చదవండి: ఆయన మూడు అంటే.. వీళ్లు ఆరు, కాంగ్రెస్ సర్జికల్ దాడులు కాగితాలపైనే: మోడీ ఎద్దేవా…

- Advertisement -