
- Advertisement -
హైదరాబాద్: ఛలో, కిరాక్ పార్టీ, గీతగోవిందం, దేవదాసు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన కన్నడ నటి రష్మిక మంథాన. ప్రస్తుతం కార్తీ 19వ సినిమాతో పాటు డియర్ కామ్రేడ్ , బీష్మ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. మహేష్ 26వ సినిమాలోను రష్మికనే కథానాయికగా ఎంపిక చేశారని అంటున్నారు.
అయితే విజయ్ దేవరకొండ సరసన రష్మిక నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ డియర్ కామ్రేడ్. మే 31న విడుదల కానున్న ఈ చిత్ర టీజర్ రీసెంట్గా విడుదలైంది. నాలుగు భాషలలో విడుదలైన ఈ టీజర్ ఫైటింగ్ సన్నివేశంతో మొదలు కాగా, లిప్ లాక్ సీన్‌తో ఎండ్ చేశారు. ఇదే టీజర్‌ని స్పూఫ్ చేసి కాస్త డిఫరెంట్‌గా రూపొందించారు నెటిజన్స్.ఈ వీడియోని షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే డియర్ లిల్లీ అని రష్మికకి బర్త్ డే విషెస్ తెలిపారు విజయ్ దేవరకొండ . అంటే డియర్ కామ్రేడ్ చిత్రంలో రష్మిక పాత్ర పేరు లిల్లీ అని తెలుస్తుంది. భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ రూపొందుతుండగా, ఇందులో కాకినాడ యాసలో మాట్లాడి అలరించనున్నాడు విజయ్. కాకినాడ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్ గా విజయ్ దేవరకొండ నటిస్తుండగా .. క్రికెటర్ గా రష్మిక మందన కనిపించనుంది.
- Advertisement -








