22.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ నన్ను చంపుతామంటూ కాల్స్ వస్తున్నాయి: రాజ్‌నాథ్‌కు కిషన్ రెడ్డి ఫిర్యాదు

నన్ను చంపుతామంటూ కాల్స్ వస్తున్నాయి: రాజ్‌నాథ్‌కు కిషన్ రెడ్డి ఫిర్యాదు

BJP Leader Kishan Reddy Meets Rajnath Singh, Newsxpressonline
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి మంగళవారం కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనను చంపుతామంటూ ఇంటర్న్ ద్వారా ఇస్లామిక్ దేశాల నుంచి కాల్స్ వస్తున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తాను హత్యా రాజకీయాలకు పాల్పడ్డానంటూ ఆరోపణలు చేసిన భారత హ్యాకర్ సయ్యద్ షుజాను పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

‘11మందిని హత్య చేశానని సయ్యద్ షుజా, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆరోపణలు చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ల ద్వారా బీజేపీ 2014లో గెలిచిందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాలని రాజ్‌నాథ్‌ను కోరాను’ అని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎన్నికల సంఘం కూడా దీనిపై దర్యాప్తు చేయాలని ఆయన కోరారు.

సీబీఐ దర్యాప్తు చేయాలని కోరా…

సయ్యద్ షుజాను శిక్షించాలన్నారు. తనకు విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తన పరువుకు భంగం కలించారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. దీనిపై పరువు నష్టం కేసు వేస్తానని అన్నారు. రఫేల్ తరహాలో తనపై కాంగ్రెస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీబీఐ ద్వారా ఈ కేసుపై దర్యాప్తు చేయాలన్నారు. ఈ విషయం గురించి పరిశీలన చేయాలని హోంశాఖ కార్యదర్శిని రాజ్‌నాథ్ సింగ్ ఆదేశించారని కిషన్ రెడ్డి తెలిపారు.

కాగా, తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్, సయ్యద్ షుజాలపై తెలంగాణ డీజీపీకి ఇప్పటికే ఫిర్యాదు చేశారు కిషన్ రెడ్డి. రాజకీయ దురుద్దేశంతోనే కుట్రపూరితంగా రాహుల్ గాంధీ, సిబల్, షుజా ఈ ఆరోపణలు చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

 

- Advertisement -