26.2 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ శివరాత్రి వేడుకల్లో కాజల్, తమన్నా..!

శివరాత్రి వేడుకల్లో కాజల్, తమన్నా..!

- Advertisement -

హైదరాబాద్: సోమవారం మహాశివరాత్రి పర్వదినాన్ని యావత్ భారతదేశం మొత్తం ఎంతో ఘనంగా జరుపుకున్నారు. అన్ని రాష్ట్రాలలోను ఉదయం నుండి రాత్రి వరకు శివాలయాలు భక్తులతో మునిగిపోయాయి. అలాగే టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ అయిన కాజల్ , తమన్నా అదితిరావు హైదరి శివరాత్రిని ఎంతో గ్రాండ్ గా జరుపుకున్నారు.

ఆధ్యాత్మిక గురువు సద్గుగురు జగ్గీ వాసుదేవ్‌కు చెందిన కోయింబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో సోమవారం రాత్రి ఓ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహాశివరాత్రి విశిష్టత గురించి వాసుదేవ్‌ ప్రసంగాలు చేయడం జరిగింది.

వేడుకల్లో పాల్గొన్న రానా , అదితిరావు...

ఈ కార్య క్రమానికి కాజల్ , తమన్నా, రానా , అదితిరావు హైదరి, నిషా అగర్వాల్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం రాత్రంతా ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకలో వీరంతా తెగ ఎంజాయ్ చేసారు.

వారంతా డ్యాన్స్ చేస్తున్న వీడియోను కాజల్‌ అభిమానులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.

చదవండి: బైక్ రేసింగ్‌లో పాల్గొంటున్న విజయ్ దేవరకొండ! ఎందుకో తెలుసా?

- Advertisement -