26.2 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ ప్రముఖ దర్శక, నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత! విషాదంలో చిత్ర పరిశ్రమ!

ప్రముఖ దర్శక, నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత! విషాదంలో చిత్ర పరిశ్రమ!

vijaya-bapineedu_ passed away, newsxpress
- Advertisement -

ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు నేటి ఉదయం మృతి చెందారు. 1936 సెప్టెంబర్ 22న చాటపర్రులో జన్మించిన బాపినీడు ఎన్నో హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన అసలు పేరు.. గుట్టా బాపినీడు చౌదరి.

సినీ ఇండస్ట్రీకి వచ్చిన తరువాత తన పేరును విజయ బాపినీడుగా మార్చుకున్నారు. తన కుమార్తెలు నిర్మించిన ‘కొడుకులు’ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. బాపినీడు తన జీవిత కాలంలో ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవితోనే సినిమాలు రూపొందించారు.

మెగా డైరెక్టర్‌గ ఆనతికాలంలోనే గుర్తింపు…

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని స్వగృహంలోనే మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. తెలుగులో 19 చిత్రాలకు దర్శకత్వం వహించారు. చిరంజీవి మెగాస్టార్ కావడానికి బాటలు వేసిన మగమహారాజు, మగధీరుడు, ఖైదీ నంబర్ 786, గ్యాంగ్ లీడర్ చిత్రాలకు దర్శకుడు విజయ బాపినీడే.

నిర్మాతగా మారి ‘యవ్వనం కాటేసింది’ అనే చిత్రాన్ని కూడా ఆయన నిర్మించారు. రాజాచంద్ర, దుర్గా నాగేశ్వరరావు, జి.రామమోహనరావు, మౌళి, వల్లభనేని జనార్దన్‌‌లను దర్శకులుగా పరిచయం చేశారు. అలాగే పాటల రచయితగా భువనచంద్రను, మాటల రచయితగా కాశీ విశ్వనాథ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత బాపీనీడుదే.

‘డబ్బు డబ్బు డబ్బు’, ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘మహానగరంలో మాయగాడు’, ‘హీరో’, ‘భార్యామణి’, ‘మహారాజు’, ‘కృష్ణగారడి’, ‘నాకు పెళ్ళాం కావాలి’, ‘దొంగకోళ్లు’, ‘మహారాజశ్రీ మాయగాడు’, ‘జూలకటక’, ‘మహాజనానికి మరదలు పిల్ల’, ‘బిగ్ బాస్’, ‘కొడుకులు’, ‘ఫ్యామిలీ’ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. విజయ బాపినీడు మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -