26.2 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన?: పరోక్షంగా హెచ్చరించిన కేంద్ర మంత్రి…

పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన?: పరోక్షంగా హెచ్చరించిన కేంద్ర మంత్రి…

mamata-benarjee-birendar-singh
- Advertisement -

chaudhary birender singh

న్యూఢిల్లీ: శారదా స్కాం కేసు విచారణకు వచ్చిన సీబీఐ అధికారులను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కోల్‌కతా దీక్ష చేపట్టడంతో ఆ రాష్ట్రంలో పరిస్థితులు గందరగోళంగా మారాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ సహా పలు పార్టీలు మమతకు మద్దతుగా నిలుస్తున్నాయి.

ఆర్టికల్ 356 (రాష్ట్రపతి పాలన)ను మైండ్‌లో పెట్టుకోవాలి…

ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉన్నట్టుగా కేంద్ర ఉక్కు మంత్రి చౌదరీ బీరేంద్ర సింగ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. రాజ్యాంగానికి లోబడి రాష్ట్రాలు పని చేస్తే బాగుంటుందని ఆయన అన్నారు. లేనిపక్షంలో ఆర్టికల్ 356 (రాష్ట్రపతి పాలన)ను మైండ్‌లో పెట్టుకోవాలని పరోక్షంగా హెచ్చరించారు.

మరోవైపు టీఎంసీ ఎంపీ సౌగథ రాయ్ పశ్చిమబెంగాల్ అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తారు. వ్యవస్థలను నాశనం చేసే విధంగా మోడీ, అమిత్ షాలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్తతకు ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీఎంసీకి మద్దతుగా కాంగ్రెస్, ఇతర విపక్షాలు కూడా తోడుకావడంతో పార్లమెంటు సమావేశాలు గందరగోళంగా సాగాయి.

చదవండి:  కొనసాగుతున్న సీఎం మమతా దీక్ష! కేంద్రం‌పై మండిపాటు, దీదీకి చంద్రబాబు వత్తాసు…

- Advertisement -