

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ప్రంట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసిన నేపథ్యంలో ఇప్పుడొక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్ తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా స్వయంగా తన ఇంటికి రావాలంటూ ఆహ్వానించడం గమనార్హం.
‘మా ఇంటిని మీ ఇల్లే అనుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఉండిపోండి..’ అని కేటీఆర్‌ను ఆహ్వానించారు ఒమర్ అబ్దుల్లా. బుధవారం తన ఇంటి ఫొటోను ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
అయితే, ఆ మంచు అందాల మధ్య ఉన్న ఒమర్ ఇంటి ఫొటోను చూడగానే కేటీఆర్‌కు ముచ్చటపడ్డారు. వెంటనే ఒమర్ ట్వీట్‌కు స్పందిస్తూ.. ‘ఒకవేళ కోరికలు నెరవేర్చే ఫ్యాక్టరీ గనుక ఉంటే.. నేను ఈ క్షణమే అక్కడ ఉండేవాడిని..’ అని ట్వీట్ చేశారు కేటీఆర్. ఈ ట్వీట్ చూసిన ఒమర్.. కేటీఆర్‌ను సాదరంగా తన ఇంటికి ఆహ్వానించారు.
నేను సీరియస్‌గానే తీసుకుంటా..
‘మా ఇంటిని మీ ఇల్లే అనుకోండి. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇక్కడ ఉండొచ్చు..’ అని ఒమర్ స్వాగతం పలికారు. ఇందుకు కేటీఆర్.. ‘ఒమర్ సాబ్ మీ ఆఫర్‌ను నేను సీరియస్‌గానే తీసుకుంటాను మరి..’ అని నవ్వుతూ మరోసారి బదులివ్వడం కొసమెరుపు. జమ్మూకాశ్మీర్‌లో పెద్ద ఎత్తున మంచు కురుస్తున్న విషయం తెలిసిందే. ఆ మంచు అందాల నడుమ ఒమర్ ఇల్లు ఎంతో ఆకట్టుకుంటోంది.
If only there was a wish granting factory, I’d have one right there; somewhere closer ❄️ ? https://t.co/M1w58SfX8Q
— KTR (@KTRTRS) January 16, 2019
If only there was a wish granting factory, I’d have one right there; somewhere closer ❄️ ? https://t.co/M1w58SfX8Q
— KTR (@KTRTRS) January 16, 2019
Hey, I am gonna take that offer rather seriously Omar Saab ? https://t.co/XVUKFxMF8W
— KTR (@KTRTRS) January 16, 2019








