
న్యూఢిల్లీ: వైశాఖ్ నాయర్ అనే యువకుడు చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురిపించుకుంటోంది. ‘జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి’ అన్నట్లు మనోడు కాస్త డిఫరెంట్‌గా ఆలోచించాడు. దూరదర్శన్ వార్తలు వచ్చేటప్పుడు వినిపించే బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌కు అనుగుణంగా బ్రేక్ డ్యాన్స్ చేసి అదరగొట్టేశాడు.
Doordarshan would not hv imagined this in their wildest dreams !! 😂 pic.twitter.com/epJ86aVssE
— (•ิ_•ิ) Silk (@Ya5Ne) March 4, 2019
దూరదర్శన్‌లో వార్తలు చూసేవారికి ఆ టైంలో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించి తెలిసే ఉంటుంది. మరి అలాంటి మ్యూజిక్‌కు ఈ కుర్రాడు బ్రేక్ డ్యాన్స్ చేసి ఆ వీడియోను ‘టిక్ టాక్’లో పోస్ట్ చేశాడు. అంతే ఇప్పుడది ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో వైరల్‌గా మారింది.
ఇప్పటికే వీడియోను లక్షమందికిపైగా చూశారు. ‘ప్రతి ట్రాక్‌కు వైశాఖ్ భలే చేశాడే’ అని కొందరు మెచ్చుకుంటే, ‘వీడికి ఇంకా పిల్ల చేష్టలు పోలేదు’ అంటూ ఇంకొందరు.. ‘జనరేటర్ మోతకు కూడా వీడు డ్యాన్స్ చేయగలడు’ అని మరి కొందరు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. చివరకు దూరదర్శన్ సంస్థ కూడా ఆ యువకుడ్ని మెచ్చుకోకుండా ఉండలేపోయింది.
చదవండి: నెట్టింట వైరల్ అవుతోన్న చిన్నారుల ఫొటో! చూసి ఫిదా అవుతున్న సెలబ్రిటీలు…








