
- Advertisement -
చండీగఢ్: వీల్‌చైర్ దానంతట అదే కదిలి ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లిపోయిన ఘటన చండీగఢ్‌లో చోటుచేసుకుంది. ఈ నెల 19న పీజీఐ ఆసుపత్రిలో ఎవరి ప్రమేయం లేకుండానే వీల్‌చైర్ దానంతట అదే ముందు వెళ్తూ మెట్లు ఎక్కి మరీ బయటకు వెళ్లిపోవడం చూసి ఆసుపత్రి సిబ్బంది, రోగులు బెంబేలెత్తిపోయారు.
ఈ మొత్తం ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఆసుపత్రి నుంచి ఎవరి ప్రమేయం లేకుండా వెళ్లిపోతున్న కుర్చీని చూసిన గార్డు నివ్వెరపోయాడు. ఆశ్చర్యంతోపాటు ఒకింత షాక్‌కు గురయ్యాడు.
గాలికి కుర్చీ కదిలిందని అనుకున్నా.. దాని పక్కన ఉన్న కుర్చీలు మాత్రం కదలకపోవడంతో భయాందోళనకు గురయ్యారు. దెయ్యమే ఆ కుర్చీని తీసుకెళ్లిందన్న ప్రచారం జరగడంతో రోగులు భయంతో వణికిపోయారు.
https://youtu.be/rVNYdGUBsRE
- Advertisement -








