25 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home Uncategorized లోకేష్ కి గంటా మార్క్ షాక్!

లోకేష్ కి గంటా మార్క్ షాక్!

Ganta Shock to Nara Lokesh, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఏపీలో ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్న నారా లోకేశ్‌ సేఫెస్ట్ ప్లేస్ కోసం వెదుక్కుంటున్నారు. మొదట్లో ఆయన కృష్ణా జిల్లాలోని పెనమలూరు నుంచి పోటీ చేస్తాడని ఇప్పటి వరకు వార్తలువచ్చాయి. అయితే ఇప్పుడు లోకేష్ కోసం బాబు సరికొత్త వ్యూహం పన్నినట్టు తెలుస్తోంది .

లోకేశ్‌కు ఓటమికి ఏ మాత్రం అవకాశం లేని స్తానం కోసం వెదుకుతున్నారట . ఆ వెదుకులాటలో భాగంగానే ఆయన కన్ను భీమిలిపై పడింది అని సమాచారం. ఇది మంత్రి గంటా నియోజకవర్గం. దమ్మంటే జగన్ ఇక్కడ పోటీ చేసి గెలవాలని ఇటీవల గంటా సవాల్ కూడా విసిరారు. తాను లక్ష మెజారిటీ గెలుస్తానని మంత్రి గంటా ఘంటాపథంగా చెబుతున్నారు.లోకేష్ పోటీ ఇంకెక్కడో…

అందుకే ఇప్పుడు లోకేశ్ భీమిలి నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారని ఇటీవల ప్రముఖ తెలుగు పత్రిక కూడా కన్ఫామ్ చేస్తూ వార్త రాసింది. చంద్రబాబు , బాలయ్య ఇద్దరూ సీమ నుంచే ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి లోకేశ్ ఉత్తరాంధ్రను ఎంచుకుని ఉండొచ్చని టాక్. కానీ సదరు లోకేశ్‌ కు మంత్రిగారు అనుకోకుండా షాక్ ఇచ్చారు. నా సీటు ఇచ్చేది లేదంటూ సిగ్నల్స్ పంపేశారు .

తాను ఈసారి భీమిలి నుంచే పోటీ చేయదలచుకున్నానని మంత్రి గంటా ఇచ్చిన స్టేట్ మెంట్ టీడీపీ పొలిటికల్ సర్కిల్లో టాక్ ఆప్ ద టౌన్ అయ్యింది. స్వయంగా నారా లోకేశే సిగ్నల్స్ పంపినా గంటా ఇలా కౌంటర్ ఇవ్వడం వారిని ఆశ్చర్యంలో పడేస్తోంది.

చదవండి:టీడీపీకి దెబ్బ మీద దెబ్బ: ఎమ్మెల్యే మోదుగుల రాజీనామా, త్వరలో వైసీపిలోకి..

- Advertisement -