29.5 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home క్రికెట్ రెండో వన్డేలో ఆసీస్‌పై భారత్‌ ఉత్కంఠ విజయం! 500వ మ్యాచ్ లో విజయం!

రెండో వన్డేలో ఆసీస్‌పై భారత్‌ ఉత్కంఠ విజయం! 500వ మ్యాచ్ లో విజయం!

India Cricket Match, Newsxpressonline
- Advertisement -

నాగ్‌పూర్‌: ఐదు వన్డేల సిరీ్‌సలో మరో అద్భుత మ్యాచ్‌.. ఆఖరి ఓవర్‌ వరకు నువ్వా.. నేనా అనే రీతిలో సాగిన రెండో వన్డేలో చివరకు భారత్‌దే పైచేయి.. విరాట్‌ కోహ్లీ (120 బంతుల్లో 10 ఫోర్లతో 116) పోరాటానికి తోడు బౌలర్ల మాయాజాలం తోడవ్వగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 పరుగుల తేడాతో నెగ్గింది.

కోహ్లి పోరాటాన్ని సద్వినియోగం చేస్తూ, బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసిన వేళ రెండో వన్డేలోనూ కంగారూలను భారత్‌ మట్టికరిపించింది. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లి కెరీర్‌లో 40వ వన్డే శతకాన్ని ఖాతాలో వేసుకుంటే, విజయ్‌ శంకర్‌ ఆల్‌రౌండర్‌గా తన విలువను పెంచుకున్నాడు. ఉత్కంఠలో ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. భారత జట్టుకు వన్డే క్రికెట్లో ఇది 500వ విజయం కావడం విశేషం.

ఛేదనలో ఓపెనర్లు ఫించ్‌ (37), ఖవాజా (38) రాణించడంతో ఆసీస్‌ 14.2 ఓవర్లలో 83/0తో లక్ష్యం దిశగా సాగింది. ఫించ్‌ను ఎల్బీగా వెనక్కి పంపడం ద్వారా కుల్‌దీప్‌ పతనాన్ని ఆరంభించాడు. అప్పటికి స్కోరు 83. అదే స్కోరు వద్ద మరో ఓపెనర్‌ ఖవాజాను జాదవ్‌ ఔట్‌ చేశాడు. షాన్‌ మార్ష్‌ (16)తో కలిసి హ్యాండ్స్‌కాంబ్‌ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.

ఐతే మార్ష్‌ను జడేజా ఔట్‌ చేసి ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. ప్రమాదకర మాక్స్‌వెల్‌ (4)లను బౌల్డ్‌ చేయడం ద్వారా ఆ జట్టుపై కుల్‌దీప్‌ ఒత్తిడి పెంచాడు. ఐతే స్టాయినిస్‌ చక్కని బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాను లక్ష్యం దిశగా నడిపించాడు. ఆసీస్‌ ఆఖరి ఓవర్‌ వరకు రేసులో ఉందంటే కారణం అతడే.

విజయ్‌ శంకర్‌ ‘ఫినిషింగ్‌’:

చివరి ఓవర్‌లో 11 పరుగులు రావాల్సి ఉం డగా అప్పటికే బుమ్రా, షమి కోటా ఓవర్లు పూర్తయ్యాయి. దీంతో జాదవ్‌, విజయ్‌ శంకర్‌లలో ఒకరితో వేయించాల్సిన పరిస్థితి. అటు క్రీజులో అర్ధ సెం చరీతో ధాటిగా ఆడుతున్న స్టొయినిస్‌ ఉన్నాడు.

చివరికి మ్యాచ్‌ మొత్తమ్మీద ఒకే ఓవర్‌ వేసి 13 పరుగులిచ్చిన విజయ్‌ శంకర్‌కే కెప్టెన్‌ బంతిచ్చాడు. దీంతో అందరిలోనూ తొలి టీ20లో ఉమేశ్‌ యాదవ్‌ అనుభవం గుర్తుకు వచ్చినా, తొలి బంతికే స్టొయిని్‌సను ఎల్బీ చేసి విజయ్‌ శంకర్‌ షాకిచ్చాడు. ఇక రెండో బంతికి జంపా రెండు పరుగులు తీసినా.. మూడో బంతికి క్లీన్‌బౌల్డ్‌ కావడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.

చదవండి:ఆసీస్‌ లక్ష్యం 251! సెంచరీ తో కదం తొక్కిన కోహ్లీ!

- Advertisement -