ఆరంభంలోనే భారీగా నష్టపొయిన సెన్సెక్స్.. అదే బాటలో నిఫ్టీ…

- Advertisement -

Sensex

ముంబై: దలాల్ స్ట్రీట్ దిగులుపడుతోంది. డాలరుతో పాలిస్తే రూపాయి మారకం విలువ దాదాపు 74 రూపాయిలు ఉండడంతోపాటు ముడి చమురు విలువ పెరుగుదల మార్కెట్లను భారీగా దెబ్బ తీస్తున్నాయి. దీంతో మదుపర్లు అమ్మకాల వైపు మొగ్గు చూపుతున్నారు.

గురువారం సెన్నెక్స్ ఆరంభంలోనే 500 పాయింట్లు పైగా నష్టపోగా, నిఫ్టీ 150 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించిది.  మధ్యాహ్నం 12.20 సమయానికి సెన్సెక్స్ 805 పాయింట్ల భారీ నష్టంతో 35170 పాయింట్ల వద్ద ఉండగా… నిఫ్టీ 244 పాయింట్ల నష్టంతో 10614 పాయింట్ల వద్ద కొనసాగుతుంది.

డాలరుతో రూపాయి మారకం విలువ 73.74 రూపాయిలు వద్ద ట్రేడవుతోంది. యస్ బ్యాంకు, హెచ్‌పీసీఎల్, భారతీ ఎయిర్‌టెల్, లార్సెన్, యాక్సిస్ బ్యాంకు మొదలైన కంపెనీల షేర్లు లాభపడుతుంటే… హీరో మోటోకార్ప్, ఐషర్ మోటర్స్, రిలయన్స్,  టీసీఎస్, జజాజ్ ఫైనాన్స్  మొదలైన కంపెనీల షేర్లు భారీగా నష్టపోతున్నాయి.

- Advertisement -