కాస్తంత ఊరట: లీటర్‌ పెట్రోల్, డీజిల్‌పై రూ.2.50 తగ్గించిన కేంద్రం, మహారాష్ట్రలో…

Petrol
- Advertisement -

Petrol

న్యూఢిల్లీ: వాహనదారులకు కేంద్రం కాస్త ఊరటనిచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌పై రూ.2.50 తగ్గించింది. గురువారం ఈ మేరకు పెట్రోల్, డీజిల్ ధర తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.

కేంద్రం పెట్రో ఉత్పత్తులపై ఉన్నఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ.1.50 చొప్పున తగ్గించగా… అయిల్ కంపెనీలు మరో రూపాయిని భరిస్తున్నట్లు…  దీంతో లీటరుకు మొత్తం రూ.2.50 తగ్గించినట్లు ఆర్థికమంత్రి తెలిపారు. ఈ కొత్త ధరలు వెంటనే అమల్లోకి రానున్నాయని. రాష్ట ప్రభుత్వాలు కూడా ఇలాగే చేయాలంటూ త్వరలోనే లేఖలు రాస్తామని ఆయన చెప్పారు.

అలాగే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో కేంద్రం దాదాపు 10,500 కోట్ల రూపాయల ఆదాయాన్నికోల్పోతుందని. అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం.. రూపాయి బలహీన పడడటం… మొదలైనవి భారత అర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నాయని వివరించారు అరుణ్ జైట్లీ.

కేంద్రం రూ2.50 తగ్గించడంతో వాహనదారులకు కాస్త ఊరట కలిగినట్లయింది. కేంద్రం చేసిన విజ్ఞ‌ప్తి మేరకు రాష్ట్రాలకు కూడా ఇలాగే ధర తగ్గిస్తే .. పెట్రోల్ రేట్లు దిగి వచ్చే అవకాశం వుంది.  నిజానికి నెల రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. అక్కడక్కడా 90 రూపాయాలు మార్కు కూడా దాటాయి. ప్రజల నుండి బాగా వ్యతిరేకత వస్తుండటంతో…  పెట్రోలు ధరలపై కేంద్రం సమీక్షించి రూ.2.50 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.


మహారాష్ట్రలో రూ.5 వరకు…

ఇంధన ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన కొద్దిసేపటికే… మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ట్విటర్ వేదికగా స్పందించారు.  కేంద్ర ప్రభుత్వం తగ్గించిన రూ.2.50కి అదనంగా తాము కూడా రూ.2.50 మేర పన్ను తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో మహారాష్ట్రలో గురువారం ఇంధన ధరలు రూ.5 మేర దిగివచ్చాయి.

 

- Advertisement -