సూపర్ ఫీచర్స్‌తో త్వరలో భారత్‌లో విడుదల కానున్న అసుస్ జెన్‌ఫోన్ 6….

4:39 pm, Tue, 21 May 19
2

ముంబై: స్మార్ట్‌ఫోన్ రంగంలో అద్భుతమైన ఫీచర్లు గల మొబైల్స్ అందించే తైవాన్‌కి చెందిన అసుస్.. త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ జెన్‌ఫోన్ 6 ను త్వ‌ర‌లో భార‌త్‌లో విడుద‌ల చేయ‌నుంది.

ఈ ఫోన్ ఇటీవలే స్పెయిన్‌లో విడుదలైంది. కాగా త్వ‌ర‌లో భార‌త్‌లోనూ ఈ ఫోన్‌ను లాంచ్ చేయ‌నున్నారు. 6/8 జీబీ ర్యామ్ వేరియంట్లలో లభించే ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.39,132 గా ఉంది. ఇందులో వినియోగదారులని ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను ఏర్పాటు చేశారు.

అసుస్ జెన్‌ఫోన్ 6 ఫీచ‌ర్లు…

6.46 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్ష‌న్‌

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌

6/8 జీబీ ర్యామ్‌, 64/128/256 జీబీ స్టోరేజ్‌

1టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై

డ్యుయ‌ల్ సిమ్‌, 48, 13 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు

ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ

బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి

5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

చదవండి: బడ్జెట్ ధరలో విడుదలైన రెడ్‌మీ నోట్ 7 ఎస్…