24.2 C
Hyderabad
Tuesday, October 13, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఆ తేడా కూడా తెలియదు, మూడు శాఖలకు మంత్రి: లోకేశ్‌పై వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్!

ఆ తేడా కూడా తెలియదు, మూడు శాఖలకు మంత్రి: లోకేశ్‌పై వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్‌పై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించిన ఆమె లోకేశ్‌పైనా సెటైర్లు వేశారు.

“బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. నిజమే నారా లోకేశ్‌కి జాబ్‌ వచ్చింది. తెలంగాణలో కేటీఆర్‌కు ఐటీ శాఖ అప్పగించడం చూసి.. అక్కడ లోకేశ్‌కి కూడా ఐటీ శాఖ అప్పగించారు. అసలు ఆయన్ని మంత్రిని చేయడమేకాక ఏకంగా మూడు శాఖలు అప్పగించారు..’’ అన్నారు.

జయంతికి, వర్థంతికి తేడా తెలియదు…

ఏ అర్హత ఉందని లోకేశ్‌ను మూడు శాఖలకు మంత్రిని చేశారని షర్మిల సూటిగా ప్రశ్నించారు. ఉద్యోగాలకు ఒక్క నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయలేదు. బాబు, మోడీ జోడి కలిసి ఏపీకి దక్కాల్సిన ప్రత్యేక హోదాను కూడా ఎగ్గొట్టేశారంటూ దుయ్యబట్టారు.

బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడానికి చంద్రబాబే కారణమని, హోదా వద్దు ప్యాకేజీ ఇస్తే చాలంటూ అసెంబ్లీలో తీర్మానం పెట్టారని మండిపడ్డారు. అదేమంటే.. హోదా వచ్చిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని బాబు అన్నారు. హోదాను నీరుగార్చిన చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారంటూ షర్మిల విమర్శించారు.

అలాగే చంద్రబాబు ప్రతి ఇంటికి రూ.1.25 లక్షలు బాకీ పడ్డారని, ఎన్నికల వేళ మళ్లీ కొత్తగా అబద్ధాలు మొదలుపెట్టారని, మోసపు హామీలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు చందమామను తెచ్చిస్తామంటే ప్రజలు మళ్లీ నమ్మాలా..?. నిప్పు నిప్పు అని పదే పదే చెప్పుకుంటే తుప్పు నిప్పైపోతుందా..?” అంటూ చంద్రబాబుపై షర్మిల విరుచుకుపడ్డారు.

చదవండి: వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆస్తుల వివరాలు చూస్తే షాకె…

- Advertisement -