
- Advertisement -
గుంటూరు: పల్నాడులో వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. నరసరావుపేట మండలం అల్లూరివారి పాలెంలో కొందరు దుండగులు వైసీపీ కార్యకర్త కోనూరి హరికిరణ్ చౌదరి(36)ని దారుణంగా హత్యచేశారు.
ఈ ఘటన నిన్ననే జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉదయం 9 గంటల సమయంలో హరికిరణ్ ఊరిలోని రామాలయం సెంటర్ వద్ద ఉండగా, కొందరు వ్యక్తులు అక్కడ ఆయనపై కత్తులు, రాడ్లతో విచక్షణారహితంగా దాడిచేసి పరారయ్యారు.
రక్తపు మడుగులో పడివున్న హరికిరణ్‌ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
- Advertisement -








