తెలంగాణలో మందుబాబుకి భారీ జరిమానా.. ఈస్థాయిలో ఇదే తొలిసారి

1:08 pm, Thu, 12 September 19

హైదరాబాద్: కొత్త వాహన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి తెలంగాణలో ఓ యువకుడికి కోర్టు భారీ జరిమానా విధించింది. గతంలో డ్రంకెన్ డ్రైవ్ పై రూ. 2 వేల జరిమానా ఉండగా, తాజాగా 10 వేల జరిమానా విధించింది.

నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మందుకొట్టి వాహనం నడుపుతూ దొరికిపోయాడు. అతడిని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా తొలి నేరంగా పరిగణిస్తూ రూ. 10 వేల జరిమానా చెల్లించాలని, లేదంటే 15 రోజుల జైలుశిక్ష అనుభవించాలని కోర్టు తీర్పు చెప్పింది.

తెలంగాణలో డ్రంకెన్ డ్రైవ్‌ కేసులో ఈ స్థాయిలో జరిమానా విధించడం ఇదే తొలిసారి.