34.1 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ షర్మిల ఫిర్యాదు: పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు? బీటెక్ యువకుడు సహా…

షర్మిల ఫిర్యాదు: పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు? బీటెక్ యువకుడు సహా…

ys-sharmila-case-on-rumors
- Advertisement -

ys-sharmila-case-on-rumors

హైదరాబాద్: వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. షర్మిలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ ఆమె ప్రతిష్ఠకు భంగం కలిగించే వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వారిలో కొందరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ కేసులో యూట్యూబ్ ప్రాంతీయ ప్రతినిధులు ఇచ్చిన సమాచారంతో పోలీసు అధికారులు పలువురి ఐపీ చిరునామాలను గుర్తించినట్లు, ఈ మేరకు హైదరాబాద్‌లో ఉంటోన్న ఆరుగురు నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు, వారిలో బీటెక్ పూర్తిచేసిన ఓ యువకుడు, మరో యువతి ఉన్నట్లు సమాచారం.

షర్మిలకు వ్యతిరేకంగా ఆడియోలు, వీడియోలు పోస్ట్ చేస్తోన్న పది యూట్యూబ్ ఛానళ్లను ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. వాటి సమాచారాన్ని యూట్యూబ్  ప్రాంతీయ ప్రతినిధులకు పంపించి, వాటి ఐపీ చిరునామాలు గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.

బీటెక్ యువకుడి పనేనా?

వైఎస్ షర్మిల, హీరో ప్రభాస్‌తో అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యానాలతో కూడిన వీడియోను బీటెక్ యువకుడు రూపొందించినట్లుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. అలాగే యూట్యూబ్‌లో ఒక ఛానల్ పేరుతో విధ్వేష ప్రచారాలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తోన్న ప్రతినిధిని కూడా పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది.

అయితే సదరు సమాచారాన్ని తాము నిర్ధారించుకున్న తరువాతే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేందుకు అనుమతిస్తున్నామని, బహుశా కిందిస్థాయి సిబ్బంది ఆ కంటెంట్‌ను మార్చి అప్‌లోడ్ చేసి ఉండొచ్చని ఆ ప్రతినిధి పోలీసు అధికారులకు వివరించినట్లు సమాచారం. మొత్తం మీద షర్మిల కేసులో పోలీసులు తీగను గట్టిగానే లాగారు.. మరి ఎవరెవరి డొంక కదులుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే!

సంబంధిత వార్తలు

షర్మిల ఫిర్యాదు: దూకుడు పెంచిన పోలీసులు, 12 వెబ్‌సైట్లు గుర్తింపు.. గూగుల్, యూట్యూబ్‌‌లకు లేఖలు!

వైఎస్ షర్మిలకు విజయశాంతి మద్దతు.. న్యాయం జరిగే వరకూ పోరాడాలంటూ పిలుపు…

ప్రభాస్‌ను ఎన్నడూ కలవలేదు.. మాట్లాడలేదు, అన్నీ పుకార్లే: వైఎస్ షర్మిల, కమిషనర్‌కు ఫిర్యాదు

 

 

 

- Advertisement -